కొన్ని సినిమాలు కొందరు హీరోల కెరీర్లో మరపురాని చిత్రాలుగా నిలిచిపోతాయి. ఆలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో నిలిచిపోయిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. మాస్ హీరోయిజం అనే పదం ఏదైనా ఉంటే దానికి రూల్ బుక్ లాంటిది ఆ సినిమా. మరి అలాంటి సినిమా టైటిల్ పై చిరంజీవి అభిమానులకు పొసెసివ్ నెస్ ఉండడం సహజమే. కానీ 'గ్యాంగ్ లీడర్' టైటిల్ ను నాని-విక్రమ్ కుమార్ సినిమాకు వాడుకోవడంపై గత కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే అసలు గ్యాంగ్ లీడర్ టైటిల్ ను మేమే రిజిస్టర్ చేసి పెట్టుకున్నామని మరో చిన్న సినిమా నిర్మాత అంటున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. దీంతో ఈ టైటిల్ పై వివాదం నెలకొంది.
నాని తన కొత్త సినిమా 'జెర్సీ' ప్రమోషన్స్ సందర్భంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సమయంలో ఈ వివాదంపై ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా 'గ్యాంగ్ లీడర్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ కథకు విక్రమ్ సినిమాకు సంబంధం లేదు. అయితే.. మా సినిమా కథకు గ్యాంగ్ లీడర్ తప్ప మరో టైటిల్ సూట్ కాదు. సినిమా చూస్తే ప్రేక్షకులే ఈ సినిమాకు గ్యాంగ్ లీడర్ కంటే మెరుగైన టైటిల్ ఉండదని ఒప్పుకుంటారు. అయినా ఈ సినిమాకు ఆ టైటిల్ అవసరం లేదని చెప్తే టైటిల్ మారుస్తాం" అని తన వెర్షన్ వినిపించాడు.
అంతా బాగానే ఉంది కానీ సేమ్ టైటిల్ తో రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తే.. ఫిలిం ఛాంబర్ లో ఆల్రెడీ అదే టైటిల్ రిజిస్టర్ చేసిపెట్టానంటున్న నిర్మాత ఊరుకోడు కదా? గతంలో ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు టైటిల్ కు ముందు హీరో పేరు చేర్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేవారు. 'మహేష్ ఖలేజా'.. 'కళ్యాణ్ రామ్ కత్తి' టైటిల్స్ అలా వచ్చినవే. అదే టైపులో 'నాని గ్యాంగ్ లీడర్' అని టైటిల్ పెట్టుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా?