2015వ సంవత్సరంలో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా విశాల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. అంతుకు ముందు అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు వెళ్లువెత్తడంతో పాటు, విశాల్ ఆ సమయంలో శరత్ కుమార్ కు గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పలు విషయాల్లో మాజీ అధ్యక్షుడు అయిన శరత్ కుమార్ కు కొరకరాని కొయ్య మాదిరిగా తయారు అయ్యాడు. విశాల్ వల్ల శరత్ కుమార్ జైలుకు వెళ్లే పరిస్థితి కూడా వస్తుందేమో అనే చర్చ జరిగింది.
కట్ చేస్తే 2019లో పరిస్థితి మారింది. ఇప్పుడు విశాల్ పై అనేక ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. నిర్మాతల మండలిలో కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విశాల్ పై పలు ఆరోపణలు వస్తున్నాయి. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా విశాల్ పదవి కాలం ముగిసిన నేపథ్యంలో ఆయన మరోసారి ఎన్నిక అవ్వడం కోసం పోటీకి సిద్దం అవుతున్నాడు. విశాల్ టీం మరోసారి తమకు ఛాన్స్ ఇవ్వమంటూ నడిగర్ సంఘం సభ్యులను కోరుతున్న ఈ సమయంలో శరత్ కుమార్ భార్య అయిన రాధిక శరత్ కుమార్ నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
విశాల్ తీరుపై ఎప్పటికప్పుడు విమర్శలు చేసే రాధిక తాజాగా తాను నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా లేను అంటూ క్లారిటీ ఇచ్చింది. నేను కాని, నా భర్త కాని నడిగర్ సంఘంకు పోటీ చేసేంత తీరికగా లేమని పేర్కొంది. అయితే విశాల్ మంచి వాడు కాదనే విషయం అందరికి తెలియడం నాకు సంతోషంగా ఉందని చెప్పింది. విశాల్ కు వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసినా కూడా వారికి తమ మద్దతు ఉంటుందని రాధిక క్లీయర్ గా చెప్పేసింది. మరో వైపు విశాల్ టీం కూడా మరోసారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నడిగర్ సంఘం భవనం కల నెరవేర్చినందుకు విశాల్ మరోసారి అధ్యక్షుడు అవ్వాలని ఆశ పడుతున్నాడు. మరి విశాల్ కు మరోసారి నడిగర్ సంఘం బాధ్యతలు దక్కేనో చూడాలి.