విల్ స్మిత్ మోస్ట్ అవైటెడ్ సెన్సేషన్ `ఐ యామ్ లెజెండ్` సీక్వెల్ ని ప్రకటించి ఏడాది పూర్తయింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలకు వస్తుంది? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మిత్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్న తరుణమిది. అవతార్ - బ్లాక్ పాంథర్- అవెంజర్స్ లాంటి సిరీస్ లకు భిన్నంగా జోంబీ (వైరస్ సోకిన మనిషి) నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ డ్రామా కథాంశంతో ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఆసక్తికర చిత్రం `ఐ యామ్ లెజెండ్`. అద్భుతమైన కథ- కథనం- టేకింగ్.. విల్ స్మిత్ అమేజింగ్ పెర్ఫామెన్స్ ఈ సినిమాని ఫైనెస్ట్ ఫీచర్ ఫిలింగా చరిత్రకెక్కించింది. 2007లో విడుదలై ఎన్నో అవార్డులు రివార్డులు కొల్లగొట్టి.. రికార్డులు తిరగరాసిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోందనగానే అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది.
రొటీన్ సూపర్ మేన్ సినిమాలకు భిన్నంగా హారర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇది కేవలం విల్ స్మిత్ మాత్రమే చేయగల హారర్ థ్రిల్లర్ ఫిక్షన్ డ్రామా అని అభిమానులు భావిస్తున్నారు. నిజానికి 2007 బ్లాక్ బస్టర్ ఐ యామ్ లెజెండ్ కి సీక్వెల్ చిత్రం గత సంవత్సరం ప్రకటించారు. విల్ స్మిత్ - మైఖేల్ బి. జోర్డాన్ తదితరులు ఇందులో నటిస్తున్నారు. రచయిత అకివా గోల్డ్స్ మన్ ఈ చిత్రం నుండి ఏమి ఆశించాలో అలాగే ఇందులో ఏ ఇతర జోంబీ తరహా లక్షణాల నుండి ప్రేరణ పొందారో ఇదివరకే వెల్లడించాడు.
ప్రఖ్యాత డెడ్ లైన్ తో ఆయన మాట్లాడుతూ- ``ఒరిజినల్ చిత్రాన్ని రాసి నిర్మించాను - ఐ యామ్ లెజెండ్ 2 మొదటి భాగానికి కొన్ని దశాబ్దాల తర్వాత జరిగే కథతో సాగుతుంద``ని ధృవీకరించారు. ఈ సీక్వెల్ తీయాలన్న నిర్ణయం వెనుక అసలైన ప్రేరణ నాటి విజయమేనని తెలిపారు. ఇది మరో కొత్త పంథా జోంబీ సినిమా.. దీనికి `ది లాస్ట్ ఆఫ్ అస్` అనే ఉప శీర్షికను నిర్ణయించారు.
``ఇది మొదటి భాగం తెరకెక్కిన సమయంతో పోలిస్తే కొన్ని దశాబ్దాల తరువాత జరిగే కథతో ప్రారంభమవుతుంది`` అని అతను చెప్పాడు. ``నేను ది లాస్ట్ ఆఫ్ అజ్ పనిలో నిమగ్నమై ఉన్నాను. ఈ చిత్రంలో మనం ప్రపంచాన్ని అపోకలిప్స్ తర్వాత మాత్రమే చూస్తాం. కానీ 20-30 ఏళ్ల తర్వాత భూగ్రహంపై సన్నివేశాన్ని చూస్తాము. భూమి కోల్పోయిన ప్రపంచాన్ని తిరిగి ఎలా పొందుతుందో మీరు తెరపై చూస్తారు. మనిషి ప్రాథమిక కౌలుదారు (భూమిని శాసించేవాడు) పదవి నుండి వైదొలిగాక ఏం జరుగుతుందనే ప్రశ్నకు ఏదో ఒక అందమైన సమాధానం మీకు ఈ సినిమాలో లభిస్తుంది. ఇది న్యూయార్క్ లో నడిచే కథాంశం. జోంబీలు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైకి ఎక్కుతారో లేదో నాకు తెలియదు. కానీ అవకాశాలున్నాయి అని తెలిపారు.
సీక్వెల్ లో స్మిత్ పాత్ర తీరు తెన్నులు ఎలా ఉంటాయో కూడా గోల్డ్స్ మన్ మొదటి భాగంలోనే స్పృశించాడు. మొదటి (ఒరిజినల్) చిత్రంలో స్మిత్ (రాబర్ట్ నెవిల్లే) మరణిస్తాడు. తనను తాను త్యాగం చేసి``డార్క్ సీకర్స్`` నాయకులలో ఒకరిని చంపి తిరిగి వైరస్ నుంచి నయం చేసే అవకాశం ఉందని నిర్ధారించుకోవడానికి ఇలా చేస్తాడు. అయినప్పటికీ అసలు రిచర్డ్ మాథేసన్ నవలకి అనుగుణంగా ఈ చిత్రం తాలూకా ప్రత్యామ్నాయ ముగింపును కూడా కనుగొన్నామని తెలిపారు.
తాజాగా విడుదల చేసిన ప్రోమో వీడియోలో ఈ సినిమా ముగింపును చూపించారు. ఈ ముగింపులో డార్క్ సీకర్ లు ఆల్ఫా డార్క్ సీకర్ సహచరిని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని నెవిల్లే (కథానాయకుడు స్మిత్) తెలుసుకుంటాడు. సహచరిని వారికి తిరిగి ఇచ్చిన తర్వాత సీకర్ లతో వివాదం ముగుస్తుంది. నెవిల్లే వైరస్ సోకిన సీకర్ ల దృష్టిలో తాను రాక్షసుడిగా మారిన విషయం గ్రహించి తన పరిశోధనను విడిచిపెడతాడు. బదులుగా ప్రాణాలతో బయటపడినవారి కాలనీని కనుగొనడానికి ముందుకు సాగుతాడు. గోల్డ్స్‌మన్ ప్రకారం. ఈ ముగింపు కానన్ గా గుర్తించాలి. సీక్వెల్ ఆద్యంతం ప్రపంచంపై మానవజాతి ఆధిపత్యం లేకుండా పోరాడుతున్నట్లు తెరపై చూపిస్తారు.
``మేం నిజానికి మాథేసన్ పుస్తకంలో ఒరిజినల్ కథను యథాతథంగా తెరపైకి తేలేదు. ఒరిజినల్ గా మొదటి చిత్రంలో ముగింపుకు విరుద్ధంగా ప్రత్యామ్నాయ ముగింపును రాసుకున్నాం`` అని తెలిపారు. ఆధిపత్య జాతులు భూగ్రహం మీద మనిషి టైమ్ ముగిసిందని సీక్వెల్ లో చెబుతున్నాం. ఇది మేము అన్వేషిస్తున్న అత్యంత ఆసక్తికరమైన విషయం... అని రచయిత అకీవా అన్నారు.
ఐ యామ్ లెజెండ్ కథాంశం:
ఐ యామ్ లెజెండ్ 2007 అమెరికన్ పోస్ట్-అపోకలిప్టిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. రిచర్డ్ మాథెసన్ అదే పేరుతో 1954 నవల ఆధారంగా రూపొందించారు. అకివా గోల్డ్స్‌మన్ - మార్క్ ప్రోటోసెవిచ్ స్క్రీన్ ప్లే నుండి ఫ్రాన్సిస్ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విల్ స్మిత్ US ఆర్మీ వైరాలజిస్ట్ రాబర్ట్ నెవిల్లేగా నటించారు. క్యాన్సర్ ను నయం చేయడానికి మొదట సృష్టించిన వైరస్ చాలా మంది మానవజాతిని తుడిచిపెట్టిన తర్వాత న్యూయార్క్ నగరంలో విలయం సృష్టిస్తుంది. రాత్రిపూట మార్పుచెందే వైరస్ జాతిగా కాకుండా న్యూయార్క్ లో నెవిల్లే (విల్ స్మిత్) ఒక్కడే చివరి మానవుడిగా మిగిలిపోతాడు. నెవిల్లే వైరస్ నుండి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాడు. వైరస్ తో ప్రభావితమై మార్పుచెందే వారి నుండి తనను తాను రక్షించుకునే సమయంలో అతను ఈ వైరస్ నివారణ ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాడు. ఇది 1964 `ది లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ `.. 1971 `ది ఒమేగా మ్యాన్` తరువాత మాథేసన్ రచించిన మూడో నవలకు మూడవ ఫీచర్-ఫిల్మ్ గా రికార్డులకెక్కింది.
వార్నర్ బ్రదర్స్ 1994లో `ఐ యామ్ లెజెండ్`ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. స్క్రిప్ట్ కు సంబంధించిన బడ్జెట్ టెన్షన్ల కారణంగా నిర్మాణం ఆలస్యమైనప్పటికీ స్టార్లు.. దర్శకులు ప్రాజెక్ట్ కి సహకారం అందించారు. ప్రొడక్షన్ 2006లో న్యూయార్క్ నగరంలో ప్రారంభమైంది, ప్రధానంగా నగరంలోని లొకేషన్ లో చిత్రీకరణ జరిగింది.ఇందులో బ్రూక్లిన్ బ్రిడ్జ్ వద్ద $5 మిలియన్ల బడ్జెట్ తో అద్భుత సన్నివేశాలను చిత్రీకరించారు.
ఐ యామ్ లెజెండ్ డిసెంబర్ 14, 2007న యునైటెడ్ స్టేట్స్ - కెనడాలో విడుదలైంది. డిసెంబర్‌లో U.S.లో విడుదలైన నాన్-క్రిస్మస్ చిత్రం కేటగిరీలో ఇది అతిపెద్ద బాక్సాఫీస్ (ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేయబడలేదు) ఓపెనర్ గా నిలిచింది. 2007లో దేశీయంగా $256 మిలియన్లు .. అంతర్జాతీయంగా $329 మిలియన్లను ఆర్జించింది. $585 మిలియన్ లతో అప్పటికి ఏడవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విమర్శకుల నుంచి సానుకూల సమీక్షలను అందుకుంది. స్మిత్ నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే నవలకు భిన్నమైన ముగింపు ను చూపించడం విమర్శలకు తావిచ్చింది. స్మిత్ నెవిల్ గా తన పాత్రను తిరిగి పోషించబోతున్నాడని అప్పుడే సూచించగా.. మైఖేల్ బి. జోర్డాన్ తో కలిసి ఈ చిత్రానికి సీక్వెల్ ని సహ-నిర్మాతగా చేయబోతున్నాడు. విల్ స్మిత్ ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View