టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ కమెడియన్స్ హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు హీరోలుగా సక్సెస్ అవ్వగా, కొందరు మాత్రం నిరాశతో మళ్లీ కామెడీ చేస్తున్నారు. సునీల్ హీరోగా మారి పలు సినిమాలు చేసి ప్రస్తుతం మళ్లీ కమెడియన్ గా చేస్తున్నాడు. కమెడియన్ గా చేసిన వారు హీరోలుగా మారడం, హీరోగా అవకాశాలు రాని సమయంలో మళ్లీ కామెడియన్ గా నటించడం కేవలం తెలుగు పరిశ్రమలోనే కాకుండా దాదాపు అన్ని భాషల పరిశ్రమలో కూడా జరగడం కన్ఫర్మ్. కాని తమిళ స్టార్ కమెడియన్ సంతానం మాత్రం తాను పూర్తి విరుద్దం అంటున్నాడు.
ఈయన రెండు మూడేళ్ల క్రితం తమిళంలో స్టార్ కమెడియన్. ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా స్టార్ హీరో సినిమా ఉండేది కాదు, అలాగే సతానం లేకుండా అక్కడ యంగ్ హీరోలు సినిమాకు కమిట్ అయ్యే వారు కాదు. అంతటి క్రేజ్ ను దక్కించుకున్న సంతానం హీరోగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం హీరోగా సక్సెస్ ట్రాక్ లో దూసుకు పోతున్నాడు. వరుసగా మంచి సినిమాల్లో నటిస్తున్న సంతానం హీరోగా సెట్ అయినట్లేనంటూ తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
సతానం తాజా చిత్రం 'దిల్లుక్కు దుడ్డు 2'. ఈ చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన సతానం హీరోగా సక్సెస్ లు రాని సమయంలో మళ్లీ కమెడియన్ గా సినిమాలు చేయను అని, హీరోగా అవకాశాలు వచ్చినన్ని రోజులు సినిమాలు చేసి, ఆ తర్వాత దర్శకుడిగా మారిపోతానంటూ చెప్పుకొచ్చాడు. హీరోగా ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యానని, ఆ సినిమాలు త్వరలోనే ప్రారంభం అవుతాయని పేర్కొన్నాడు.
సంతానం మళ్లీ కామెడీ పాత్రలు చేయనంటూ క్లారిటీ ఇవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. సంతానం దర్శకుడిగా తొలి సినిమాను ఆర్యతో చేస్తానంటూ కూడా ప్రకటించాడు. అది ఎప్పుడు అనేది తనకే తెలియదన్నాడు.