రాజశేఖర్ గారి వల్లనే మా ఊళ్లో ఫేమస్ అయ్యాను: సుకుమార్

Update: 2022-05-18 02:59 GMT
రాజశేఖర్ హీరోగా చేసిన 'శేఖర్' సినిమా ఈ నెల 20వ తేదీన  ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జీవిత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, నిన్న రాత్రి  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన సుకుమార్ మాట్లాడుతూ .. "రాజశేఖర్ గారికి సంబంధించిన ఒక విషయం చెబుతాను.

ఆహుతి .. ఆగ్రహం .. అంకుశం .. తలంబ్రాలు వంటి సూపర్ హిట్లతో ఆయన పీక్ లో ఉన్నప్పుడు నేను ఆయనకి వీరాభిమానిని అయిపోయాను. నా ఫ్రెండ్ కృష్ణ ఇప్పుడు ఆర్టిస్ట్ గా సినిమాల్లో చేస్తున్నాడు. అప్పట్లో మా ఊళ్లో ఆయన హీరోలందరినీ ఇమిటేట్ చేసేవాడు.

అందరూ ఆయనను మెచ్చుకోవడం చూసి నేను జెలసీ ఫీలయ్యేవాడిని. మొట్టమొదటిసారిగా నేను మా ఊళ్లో రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసి .. ఫేమస్ అయ్యాను. ఇక అందరూ నా చుట్టూ చేరి .. రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేయమని అడుగుతూ ఉండేవారు.

అలా సినిమాలకి సంబంధించి నేను కూడా ఏదైనా చేయగలను అనే ఒక నమ్మకం నాపై నాకు కలగడానికి కారణం రాజశేఖర్  గారే. ఇది అతిశయోక్తి  కానే కాదు. ఇలాంటి ఒక సందర్భం రాలేదు కనుక చెప్పలేకపోయాను. నా సినిమాకి సంబంధించిన లైఫ్ ను ఇంత అద్భుతంగా మార్చిన ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను

నేను ఒక విషయం గమనించాను .. మనందరం సినిమా ఫీల్డ్ అనగానే మన  పిల్లలను దూరం పెడుతుంటాము. ఇదే  ప్రొఫెషన్ లో ఉంటూ .. ఇక్కడే డబ్బులు సంపాదిస్తూ .. ఇక్కడే అన్నీ అనుభవిస్తూ .. మన ఫ్యామిలీని మాత్రం దూరం  పెడుతుంటాము. కానీ  ఆయన తన ఇద్దరు ఆడపిల్లలను ముందుకు తీసుకుని వచ్చి  సినిమాల్లో నిలబెట్టారు చూశారా? అందుకు నేను ఆయనకి హ్యాట్సాఫ్  చెబుతున్నాను. ఈ సినిమా ఫీల్డ్ చాలా పవిత్రమైనదని ఆయన చెప్పకనే చెప్పారు  .. తాను ఉన్న సినిమా ఫీల్డ్ ను గౌరవించారు.

ఒక డైరెక్టర్ కి  ఎంత బాధ ఉంటుందో .. బాధ్యత ఉంటుందో నాకు తెలుసు. అలాంటి బాధ్యతను నిర్వర్తిస్తూ జీవితగారు పడుతున్న టెన్షన్ ను నేను గమనిస్తూనే ఉన్నాను. ఇంతగా తాపత్రయ పడుతూ ..  ఇంతటి భారాన్ని మోస్తున్న  ఆమెకి దణ్ణాలు.

ఈ సినిమా ఆమె కోసం సక్సెస్ కావాలని .. బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. అనూప్ ఎన్ని హిట్స్ ఇచ్చినా ఇలా వినయంతోనే కనిపిస్తుంటాడు. తను మరిన్ని మంచి హిట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించారు.
Tags:    

Similar News