ప్రభాస్ హీరోగా రూపొందిన రాధేశ్యామ్ సినిమా కు పలువురు సంగీత దర్శకులు వర్క్ చేశారు. సౌత్ వర్షన్ కు గాను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను థమన్ ఇచ్చాడు. థమన్ ఎంపిక చివరి నిమిషంలో జరిగిందనే విషయం తెల్సిందే. థమన్ 'అఖండ' విజయం తర్వాత రాధేశ్యామ్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే అవకాశంను దక్కించుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఇప్పటి వరకు మాస్ మసాలా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన థమన్ ఒక ఫీల్ గుడ్ మూవీకి సంగీతాన్ని ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించలేడు అనే ఒక అభిప్రాయం కొందరి లో ఉంది. ముఖ్యంగా ఇండస్ట్రీ వర్గాల వారు థమన్ కేవలం మాస్ సినిమాలకు మాత్రమే అనే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే వారి అభిప్రాయంను మార్చేందుకు థమన్ రాధేశ్యామ్ చేశాడట.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ.. అఖండ సినిమా తర్వాత నా నుండి ప్రతి ఒక్కరు కూడా మాస్ బీట్ ను ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నా బీజీ లౌడ్ గా ఉంటుంది.. మాస్ యాక్షన్ సన్నివేశాలకు మాత్రమే సెట్ అవుతుందని భావిస్తున్నారు. నా పై ఉన్న ఆ తరహా ఇమేజ్ ను మార్చుకోవాలనే ఉద్దేశ్యంతో రాధేశ్యామ్ సినిమాకు సైన్ చేశాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. రాధేశ్యామ్ ఒక అద్బుతమైన లవ్ కమ్ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అంటూ మొదటి నుండి ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. రాధేశ్యామ్ సినిమా లో యాక్షన్ సన్నివేశాలు కాని.. మాస్ డైలాగ్స్ కాని ఏమీ ఉండవట. చాలా కూల్ గా సినిమా సాగుతుంది. అలాంటి సినిమా కు థమన్ ఎలా వాయించాడు అనేది ఆసక్తిగా మారింది.
రాధేశ్యామ్ సినిమా ను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. కాని కరోనా థర్డ్ వేవ్ వల్ల సినిమా ను వాయిదా వేయాల్సి వచ్చింది. మార్చి లో పరిస్థితులు అన్ని అనుకూలిస్తే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సౌత్ తో పాటు ఉత్తరాదిన భారీ ఎత్తున సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా లో ప్రభాస్ జోతిష్యుడిగా కనిపించబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కృష్ణం రాజు కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.