బాలీవుడ్ సూపర్ స్టార్ బాద్ షా షారుఖ్ ఖాన్ చివరిగా జీరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూడు సంవత్సరాలకు పైగా అయింది ఆ సినిమా వచ్చి. ఇప్పటి వరకు ఆయన నుండి పూర్తి స్థాయి సినిమా రాలేదు. అప్పుడప్పుడు గెస్ట్ గా కనిపిస్తూ తన అభిమానులను పలకరిస్తూ వస్తున్నాడు.
బ్రహ్మాస్త్ర సినిమాలో దాదాపుగా పావుగంట పాటు షారుఖ్ కనిపించాడు. అది కాస్త ఎక్కువ సమయమే అనుకోవచ్చు. భారీ అంచనాల నడుమ రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమాలో షారుఖ్ ఖాన్ నటించిన విషయాన్ని విడుదలకు ముందు వరకు సస్పెన్స్ గా ఉంచారు.
విడుదల కొన్ని రోజులు ఉండగా రివీల్ అయ్యింది. షారుఖ్ ఖాన్ కీలక గెస్ట్ రోల్ లో నటించాడు అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. ఆయన అభిమానులు మూడు సంవత్సరాల తర్వాత బాద్ షాని బిగ్ స్క్రీన్ పై ఒక మంచి కమర్షియల్ సినిమాలో చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తీరా సినిమా విడుదల అయిన తర్వాత షారుఖ్ ఖాన్ పాత్ర విషయంలో అభిమానులు పెదవి విరుస్తున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇలా చేశాడేంటి అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బ్రహ్మాస్త్ర సినిమా గురించి ఓ రేంజ్ లో ప్రచారం చేసి చివరకు ఇలాంటి కంటెంట్ లేని సినిమాను తీసుకు వచ్చారంటూ విమర్శలు వస్తున్నాయి.
భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కు సంబంధించిన వసూళ్లు మొదటి రోజే నిరాశ పర్చాయి. గౌరవ ప్రధమైన వసూళ్లు నమోదు అవ్వడం దాదాపు అసాధ్యం అనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్.. కింగ్ నాగార్జున మరియు కింగ్ ఖాన్ షారుఖ్ లు ఉన్నా కూడా సినిమాను నిలబెట్టలేక పోయారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.