డ‌బ్బు కోసం ఆ ప‌ని చేయ‌ను: త‌మ‌న్నా

Update: 2022-05-02 23:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. గత దశాబ్దన్న‌ర‌ కాలం నుంచీ సౌత్ తో పాటు నార్త్ లోనూ స‌త్తా చాటుతున్న త‌మ‌న్నా.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో దాదాపు స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపాడింది.

త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో పాటు అవ‌స‌రం మేర‌కు అందాల‌ను కూడా ఆర‌బోసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి పదిహేనేళ్లు పూర్తైనా.. ఇప్ప‌టికీ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న త‌మ‌న్నా బోల్డ్ రోల్స్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇంత‌కీ ఆమె ఏం చెప్పిందంటే.. 'నేను హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా ఏళ్ళైపోయింది. సీనియారిటీ కూడా పెరిగింది. దాన్ని కాపాడుకోవ‌డం నా బాధ్య‌త‌. నేను ఎంచుకునే సినిమాలే నా సీనియారిటీని, స్థాయిని కాపాడతాయి. అందుకే పాత్రల ఎంపిక‌ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నాను.

క‌థ డిమాండ్ చేస్తే గ్లామ‌ర్ షో చేయ‌డానికి నేను సిద్ధ‌మే. కానీ, బోల్డ్ రోల్స్ కు మాత్రం నో చెప్పేస్తా. తమన్నా ఏంటి ఇలాంటి పాత్రలో నటించింది అని నా అభిమానులు, ప్రేక్ష‌కులు చిరాకు పడకూడదు.

డ‌బ్బు కోసం నా స్థాయిని చెడ‌గొట్టే రోల్స్ ను ఎప్ప‌టికీ చేయ‌ను.' అంటూ త‌మ‌న్నా చెప్పుకొచ్చింది. దీంతో త‌మ‌న్నా కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మార‌గా.. ఆమె మాట‌ల‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల 'సీటీమార్‌' తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన త‌మ‌న్నా ఇప్పుడు 'ఎఫ్ 3'తో రాబోతోంది. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలు కాగా.. వారికి జోడీగా త‌మ‌న్నా, మెహ్రీన్ లు న‌టించారు. కొద్ది రోజుల క్రిత‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ మే 27న గ్రాండ్ గా విడుద‌ల కాబోతోంది.

అలాగే త‌మ‌న్నా మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న 'భోళా శంక‌ర్‌', స‌త్య‌దేవ్ తో 'గుర్తుందా శీతాకాలం' చిత్రాలు చేస్తోంది. బాలీవుడ్ లో 'ప్లాన్ ఏ ప్లాన్ బీ', 'బోలే చుడియాన్' చిత్రాల్లో న‌టిస్తున్న త‌మ‌న్నా.. ప్రముఖ దర్శకుడు మ‌ధుర్ భండార్క‌ర్ డైరెక్ష‌న్ లో 'బబ్లీ బౌన్సర్' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైతం సైన్ చేసింది.
Tags:    

Similar News