'క్వారంటైన్ లో ఆ యాక్టర్ తో గడిపాను'

Update: 2020-12-29 02:30 GMT
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. 47 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్స్‌ తో పోటీ పడుతూ హోట్నెస్ తో అదరగొడుతోంది. హాట్‌ గా కనిపించడంతో పాటు ఫిట్ గా ఉండటం మలైకా స్పెషాలిటీ. అందుకేనేమో ఒక బిడ్డకు తల్లి కూడా అయిన మలైకా అందానికి తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ పడిపోయాడు. మలైకా తన భర్తతో విడిపోయాక అర్జున్ కపూర్‌ తో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని వీలు కుదిరినప్పుడల్లా టూర్ లకు వెళ్తూ హల్‌ చల్ చేస్తుంటారు. అంతేకాకుండా ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటూ దిగిన ఫోటోలను సోషల్ మీడియా మధ్యమాలలో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

ఇటీవల ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడిన మలైకా - అర్జున్ జంట తక్కువ సమయంలోనే కోలుకున్నారు. మళ్ళీ కలిసి తిరగడం స్టార్ట్ చేశారు. అయితే తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైక అరోరా తన క్వారంటైన్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా 'మీకు ఒకవేళ అవకాశం వస్తే ఏ యాక్టర్ తో కలిసి క్వారంటైన్‌ లో ఉండాలి అనుకుంటారు?' అని ప్రశ్నించగా అసలు విషయం బయట పెట్టింది మలైకా. 'నిజం చెప్పాలంటే.. నేను క్వారంటైన్‌ లో ఓ యాక్టర్ తో కలిసి ఉన్నాను. అతను చాలా మంచివాడే కాకుండా చాలా సరదా మనిషి. అతనితో ఉంటే ప్రతి క్షణం చాలా ఉత్సాహంగా ఉంటుంది' అని మలైకా సమాధానం చెప్పింది. అర్జున్ కపూర్ పేరు వెల్లడించకుండానే అతని గురించి పరోక్షంగా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మరి వీరిద్దరి రిలేషన్ షిప్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.


Tags:    

Similar News