కోవిడ్ క‌ల్లోలంలో 5 నెల‌లు స్టార్ హోట‌ల్లోనే న‌టి

Update: 2021-05-02 03:34 GMT
కెరీర్ ప‌రుగులో భాగంగా ముంబై టు హైద‌రాబాద్ ప్ర‌యాణించే భామ‌ల‌కు క‌రోనా క్రైసిస్ స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించాల‌న్నా.. లేదా ఏదైనా సినిమానో వెబ్ సిరీస్ నో చేయాల‌న్నా అటూ ఇటూ విమానాల్లో ప్ర‌యాణించాల్సి ఉంటుంది. కానీ అనూహ్యంగా 2020 లో లాక్డౌన్ సమయంలో పనిలేకుండా కూర్చోవలసి వచ్చిందని వాపోయింది ముంబై బ్యూటీ మ‌న్నారా చోప్రా.

గ‌త ఏడాది అక్టోబర్ లో కొన‌సాగుతున్న క్రైసిస్ వ‌ల్ల‌ హైదరాబాద్ కు మకాం మార్చార‌ట మ‌న్నారా. ఆ త‌ర్వాత కెరీర్ లో బిజీ అయిపోతాన‌ని ఆశించినా ఆశాభంగ‌మైంది. ముంబై - హైదరాబాద్ మధ్య అటూ ఇటూరాక‌పోక‌లు చేయాల్సి ఉంది. వాణిజ్య ప్రకటనలతో పాటు కొన్ని  ఇతర ప్రాజెక్టుల షూటింగ్ కి జాయిన్ కావాల్సి ఉండ‌గా.. ఈ సంవత్సరం మార్చిలో ఆమె తిరిగి ముంబైకి వెళ్లింది. మహమ్మారి రెండో వేవ్ వ‌ల్ల మ‌న్నారా తన ఇంటికి మాత్రమే పరిమితం అయ్యింది.

గత సంవత్సరం మార్చిలో లాక్ డౌన్ ప్రకటించినప్పుడు దేశంలోని పరిస్థితుల గురించి నేను నిరుత్సాహపడ్డాను. పని చేయలేకపోయాను. అన్ లాక్ దశ ప్రారంభమైనప్పటికీ ముంబైలో పనులు మొద‌ల‌వ్వ‌లేదు అని మన్నారా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

హైదరాబాద్ వ‌చ్చాక ఏకంగా నాలుగు నెలలకు పైగా ఇక్కడ ఒక హోటల్ లోనే లాక్ అయిపోయార‌ట‌. ఇంట్లో పనిలేకుండా కూర్చోలేనందున రిస్క్ తీసుకున్నాన‌ని తెలిపారు. నేను పని చేయడానికి అలవాటు పడ్డాను.. కాబట్టి పనిలేకుండా ఉండే సమయాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమైంది అని అన్నారు.

మ‌ళ్లీ మార్చి 2021 లో ముంబైకి తిరిగి వెళ్లాక అక్క‌డ పరిస్థితి చాలా భయానకంగా మారింది. మొదటిసారి నేను హైదరాబాద్ ఇతర ప్రదేశాలలో కొన్ని ప్రాజెక్టులను వ‌దిలేయాల్సి వచ్చింది. నేను ఈ సమయంలో ప్రయాణించాలనుకోవ‌డం లేదు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలి..అని ఆమె విజ్ఞప్తి చేసింది.

సెకండ్ వేవ్ వైర‌స్ ప్ర‌మాద‌క‌రం. ఇది అనేక కొత్త లక్షణాలను క‌లిగి ఉంది. మార్చి 2020 లో త‌న‌కు COVID-19 కు సంక్రమించి ఉండవచ్చని కూడా మన్నారా అభిప్రాయపడ్డారు. తొలుత ఊపిరి క‌ష్ట‌మైంది. నిరంతరం దగ్గు.. శరీర నొప్పులతో బాధపడ్డాను. లక్షణాలు తీవ్రమయ్యాయి. దీంతో చివరగా నేను ముంబైలోని ఒక వైద్యుడి వద్దకు వెళ్ళాను. బయట పరిస్థితి బాలేదని ఇంట్లోనే ఉండమని అన్నారాయ‌న‌.

``నేను ఊపిరి పీల్చుకోలేకపోయాను.. నిద్రించలేకపోయాను`` అని కూడా మ‌న్నారా తెలిపారు. ఆ సమయంలో భారతదేశంలో COVID కోసం పరీక్షా వస్తు సామగ్రి అందుబాటులో లేదు. కాబట్టి ఆమె రోగ నిర్ధారణ ప‌రీక్ష చేయించుకోలేకపోయింది. ఆ త‌ర్వాత‌ ఇంట్లోనే ఇతరులకు దూరంగా ఉండి ఆవిరి పీల్చడం .. శ్వాస వ్యాయామాలను అభ్యసించడం ప్రారంభించారు. మూడవ వారంలో నేను కోలుకునే సంకేతాలు క‌నిపించాయ‌ని మన్నారా చెప్పారు.

తరువాత భారతదేశానికి విమానాలు రద్దయిన తరువాత అమెరికాలో చిక్కుకున్న ఆమె సోదరి మిథాలి.. వందే భారత్ సేవలో తిరిగి రాగ‌లిగారు. ల్యాండింగ్ తర్వాత COVID-19- పాజిటివ్ వ‌చ్చింది.

ప్రస్తుతం ముంబైలో త‌న ప‌నులు తానే చేసుకుంటున్నాన‌ని మన్నారా చెప్పారు. అమ్మా నాన్న దిల్లీలో ఉన్నారు. ఈ సమయంలో నేను వారిని సందర్శించాలనుకోవడం లేదు. నేను సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నాను.. అని తెలిపారు. ప్ర‌స్తుతం మన్నారా ఉచ్చారణపై ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. ఇది డైలాగ్ డెలివరీ కోసం డిక్షన్ మెరుగుపరచడానికి బాగా వ్యక్తీకరించడానికి సహాయపడుతుందని చెప్పింది. మన్నారా ప్ర‌స్తుతం `హేల్ దిల్` అనే షార్ట్ ఫిలింలో కనిపిస్తుంది.
Tags:    

Similar News