ఈ ఏడాది ఆరంభం నుంచి టాలీవుడ్ లో పెద్ద పెద్ద రికార్డులు నమోదవుతున్నాయి. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు ఈ రికార్డులు నమోదు చేస్తున్నాయి. సహజంగా హిట్ సినిమాల రికార్డుల గురించి మాట్లాడుకుంటాం. కానీ 2018 ఆరంభం నుంచి ఫ్లాప్ సినిమాలు కూడా కొత్త రికార్డులు సెట్ చేస్తున్నాయి.
అజ్ఞాతవాసి చిత్రం దేశ సినిమా చరిత్రలో బాంబే వెల్వెట్.. స్పైడర్ ల తర్వాత మూడో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. తర్వాతి రేంజ్ ను ఈ రిటర్న్ బేస్డ్ పర్సంటేజ్ కేటగిరిలో చేర్చరు కానీ.. అంతకంటే పెద్ద ఫ్లాపులే నమోదవుతున్నాయి. జనవరిలో రాజ్ తరణ్ నటించిన రంగుల రాట్నం ఫ్లాప్ కాగా.. ఫిబ్రవరి ఆరంభం నుంచి చూస్తే రవితేజ మూవీ టచ్ చేసి చూడు.. మోహన్ బాబు గాయత్రి.. సాయిధరంతేజ్ నటించిన ఇంటెలిజెంట్ లు బడా ఫ్లాపులుగా నిలిచాయి. ఇప్పుడు తరుణ్ నటించిన ఇది నా లవ్ స్టోరీ కూడా ఇదే కేటగిరిలోకి చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తొలి రోజు తొలి ఆట నుంచే ఈ చిత్రానికి ఘోరమైన టాక్ వచ్చింది. అన్ని ఏరియాల నుంచ మౌత్ టాక్ అస్సలు బాలేదు. నిర్మాణ విలువలు అస్సలు కనిపించకపోవడం.. ప్రచారం కోసం నిర్మాతలు ఏ మాత్రం ప్రయత్నించకపోవడం వంటి వాటితో ఓపెనింగ్స్ కూడా కనిపించలేదు. మళ్లీ తనకు లవర్ బోయ్ ఇమేజ్ ను తెచ్చిపెడుతుందనే ఆశతో.. వేలంటైన్స్ డే నాడు ఇది నా లవ్ స్టోరీ అంటూ తరుణ్ ఆడియన్స్ ముందుకు వచ్చినా.. ఈ చిత్రం సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు.