చిత్రం : ‘ఇది నా లవ్ స్టోరీ’
నటీనటులు: తరుణ్ - ఒవియా - ఖయ్యూం తదితరులు
సంగీతం: శ్రీనాథ్ విజయ్
ఛాయాగ్రహణం: క్రిస్టఫర్ జోసెఫ్
కథ: సింపుల్ సుని
నిర్మాత: ఎస్వీ ప్రకాష్
రచన - దర్శకత్వం: రమేష్ గోపి
‘నువ్వే కావాలి’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ మొదలుకుని.. ‘నువ్వు లేక నేను లేను’.. ‘ప్రియమైన నీకు’ లాంటి సూపర్ హిట్లతో ఒకప్పుడు తరుణ్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులతో అతను ఇండస్ట్రీ నుంచి దాదాపుగా అంతర్ధానమైపోయాడు. ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత అతనిప్పుడు ‘ఇది నా లవ్ స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి తరుణ్ రీఎంట్రీ మూవీ విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
అభిరామ్ (తరుణ్) ఒక యాడ్ ఏజెన్సీ నడుపుతున్న కుర్రాడు. అతను ఒక రోజు అనుకోకుండా అభినయ (ఒవియా) అనే అమ్మాయిని కలుస్తాడు. తనతో కలిసి ఒక ఇంట్లో ఒక రోజంతా గడుపుతాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరి ప్రేమకథల గురించి మరొకరు పంచుకుంటారు. వాళ్లిద్దరూ లవ్ ఫెయిల్యూర్లే. తమ జీవితానుభవాలు చెప్పుకునే క్రమంలో ఇద్దరి అభిరుచులు కలుస్తాయి. పరస్పరం ప్రేమ పుడుతుంది. అభితో జీవితం పంచుకోవడానికి సిద్ధమైన అభినయ.. మరుసటి రోజు ఉదయానికి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అభి ఎవరో తెలియనట్లు వ్యవహరిస్తుంది. ఇంతకీ ఆమె ఎందుకలా చేస్తుంది..? తన సమస్యేంటి..? తన గతమేంటి..? అభి జీవితంలో ఇంతకుముందేం జరిగింది..? చివరికి అభి-అభినయ కలిశారా లేదా అన్నది తెరమీదే చూడాలి.
కథనం - విశ్లేషణ:
సినిమా అనేది దృశ్య ప్రధానమైంది. దృశ్యంతోనే ప్రేక్షకుడికి అన్ని అనుభూతులూ కలిగించాలి. ఆ క్రమంలో డైలాగ్స్ అనేవి సాయం చేయాలి. సన్నివేశాల్లో భాగంగా డైలాగులుండాలి తప్ప.. మొత్తం డైలాగులే నిండిపోకూడదు. ముఖ్యంగా ప్రేమకథలకు దృశ్యం అనేది మరీ కీలకం. ప్రేమ భావనలు కలిగించాల్సింది.. ప్రేక్షకుల్లో ఒక ఫీల్ తీసుకురావాల్సింది సన్నివేశాలు తప్ప కేవలం మాటలు కాదు. తెర మీద మరబొమ్మల్లా పాత్రల్ని నిలబెట్టి అసలు సన్నివేశమంటూ ఏమీ లేకుండా.. మాట్లాడుతూ ఉండమని పేజీలకు పేజీలు డైలాగులిచ్చి వదిలిపెడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ‘ఇది నా లవ్ స్టోరీ’ ఒక ఉదాహరణ. ఇందులో ఐదారు సినిమాలకు సరిపడా డైలాగులుంటాయి.
ప్రేమ భావనల్లో మునిగి తేలేవాళ్లు.. ప్రేమలో విఫలమైనవాళ్లు.. ప్రేమసారాన్ని ఔపాసన పట్టిన వాళ్లు తమకు తోచిందంతా రాసి పెడితే.. ఆ పుస్తకాల్లోని వాక్యాలన్నీ పట్టుకొచ్చి.. సినిమాలో సమయం సందర్భం చూడకుండా.. కథాకథనాల గురించి కూడా ఏమీ ఆలోచించకుండా.. పేర్చేసినట్లు అనిపిస్తుంది సినిమా చూస్తే. సినిమా మొదలైనప్పటి నుంచి చివరిదాకా డైలాగులే డైలాగులు.. వేదాంతాలే వేదాంతాలు.. పంచులే పంచులు. మామూలుగా ఏదైనా విషయం అర్థం కాకపోతే ఉదాహరణలు.. పోలికలు చెబుతారు. కానీ ఇందులోని ప్రధాన పాత్రలు మాత్రం ముందు ఏదో ఉదాహరణ లేదంటే పోలిక చెప్పి.. ఆ తర్వాత అసలు విషయం చెబుతాయి. ఒక సీరియస్ సన్నివేశం నడుస్తున్నపుడు హీరోయిన్ ‘‘కుక్క బిస్కెట్లో కుక్క ఉండదు కానీ.. క్రీమ్ బిస్కెట్లో క్రీమ్ ఉంటుంది’’ అంటూ డైలాగ్ పేలుస్తుంది. అసలు ఆ సీన్లో ఈ డైలాగ్ అవసరమేంటో అర్థం కాదు.
ఇదొక్కటేనా.. ‘‘నన్ను తన లైఫ్ నుంచి డ్రాప్ చేసిన వాడిని నేను ఎయిర్ పోర్టులో డ్రాప్ చేశా’’.. ‘‘నా కాలు తొక్కి సారీ చెప్పాడు. కానీ నా హార్టుని తొక్కి సారి చెప్పలేదే’’.. ‘‘నీ హార్ట్ లోంచి నన్ను తీసేసి హార్టీ వెల్కం అంటూ కార్డిస్తావా’’.. ‘‘నా ప్రేమను చెబుదామని అతడి దగ్గరికొస్తే వేడెక్కిన పెనం మీద దోసె పోసినట్లు తన ప్రేమను చెప్పాడే’’.. .. అంటూ సినిమా నిండా అసందర్భోచితంగా డైలాగులు దాడి చేస్తూనే ఉంటాయి.
దాదాపు 95 శాతం సినిమాలో హీరో హీరోయిన్లు మాత్రమే కనిపిస్తుంటారు. అందులోనూ ప్రథమార్ధమైతే వేరే పాత్ర ఒక్కటంటే ఒక్కటీ కనిపించదు. చివరికి హీరో తన ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న వేరే అమ్మాయిని కూడా వర్తమానంలో ఉన్న కథానాయిక లాగే ఊహించుకుంటాడు. హీరోయిన్ కూడా తన ఫ్లాష్ బ్యాక్ లోని వ్యక్తి బదులు ఇతడినే ఊహించుకుంటుంది. కనీసం వేరే పాత్రలు కనిపించినా.. కొంచెం రిలీఫ్ వచ్చునేమో. గంటకు పైగా వేరే పాత్రన్నదే కనిపించదు. హీరో హీరోయిన్లు డైలాగులు పేల్చడంలో పోటీ పడుతుంటారు. కథ మాత్రం ముందుకు సాగదు. ఇద్దరి బ్యాక్ స్టోరీలు పేలవంగా ఉంటాయి. చివర్లో ఒక చిన్న ట్విస్టు మాత్రమే ఈ కథలో చెప్పుకోదగ్గ విశేషం. ‘ఇది నా లవ్ స్టోరీ’ అంటూ టైటిల్ పెట్టారు కానీ.. సినిమాలో ‘లవ్’ ఎంతమాత్రం లేదు. ప్రధాన పాత్రల మధ్య ఏమాత్రం కెమిస్ట్రీ లేదు. రొమాన్స్ పండలేదు. ఒకప్పడు మంచి లవ్ స్టోరీలతో లవర్ బాయ్ అని పేరు తెచ్చుకున్న తరుణ్ మీద అభిమానంతో ఎవరైనా సినిమాకు వెళ్తే మాత్రం ఈ హ్యాంగోవర్ నుంచి బయటపడటానికి మళ్లీ అతను నటించిన మంచి లవ్ స్టోరీల్ని ఒకసారి చూడాల్సిందే.
నటీనటులు:
తరుణ్ సిన్సియర్ గా తన ప్రయత్నమేదో తాను చేశాడు కానీ.. ఇలాంటి సినిమాలో.. ఇలాంటి పాత్రలో అతడిని చూసి ఒకప్పటి అభిమానులు మరింత వేదనకు గురవుతారు. తరుణ్ లుక్స్ అక్కడక్కడా కొంచెం ఇబ్బందిగా అనిపించినా.. నటన విషయంలో మాత్రం అతను ఓకే అనిపించాడు. మారిన లుక్స్ వల్ల లవ్ స్టోరీలో అంత బాగా ఇమడలేదు. ఇక హీరోయిన్ ఒవియా ఈ పాత్రకు ఏమాత్రం సూటవ్వలేదు. ఆమె మరీ ముదురుగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రేమకథలకు అవసరమైన సున్నితత్వం ఆమెలో లేదు. నటన విషయంలో ఒవియా బాగానే చేసింది. ఇక సినిమాలో మిగిలిన పాత్రలు వేటికీ ప్రాధాన్యం లేదు. 95 శాతం సినిమాలో హీరో హీరోయిన్లే కనిపిస్తారు. మిగతా పాత్రలు నామమాత్రం.
సాంకేతికవర్గం:
సినిమాలో కొంచెం చెప్పుకోదగ్గ ఆకర్షణ అంటే శ్రీనాథ్ విజయ్ సంగీతం మాత్రమే. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రెండు డ్యూయెట్లూ వినడానికి బాగున్నాయి. వాటి చిత్రీకరణా ఓకే. నేపథ్య సంగీతం పర్వాలేదు. జోసెఫ్ ఛాయాగ్రహణం మామూలుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సాదాసీదాగా అనిపిస్తాయి. వేరే భాష నుంచి అరువు తెచ్చుకున్న ఈ కథలో కూడా పెద్ద విశేషం ఏమీ లేదు. క్లైమాక్స్ ఒక్క చోట కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కథే అంతంతమాత్రంగా ఉంటే.. దాన్ని దర్శకుడు రమేష్ గోపి పేలవంగా తెరకెక్కించాడు. డైలాగులు సినిమాకు అతి పెద్ద మైనస్. అవి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.
చివరగా: ఇది లవ్ లెస్ బోరింగ్ స్టోరీ!
రేటింగ్- 1.5/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre