ఒవియాతో తరుణ్ లవ్ స్టోరీ

Update: 2018-01-08 11:31 GMT
లవర్ బోయ్ గా తరుణ్ జనాలకు బాగానే తెలుసు కానీ.. గత కొన్నేళ్లుగా ఈ హీరో సినిమాలు రావడం ఆగిపోయింది. లవర్ బోయ్ క్యారెక్టర్లు చేసే ఏజ్ నుంచి కూడా తరుణ్ దాటిపోతున్నాడని అంతా అనుకుంటున్న టైంలో.. మళ్లీ తనకు అచ్చొచ్చిన.. తనకు పట్టున్న జోనర్ లోనే సినిమా చేసి.. ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు తరుణ్.

ఇది నా లవ్ స్టోరీ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేమికుల రోజు సందర్భంగా.. వచ్చే నెల 14న విడుదల చేయనుండగా.. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ బాగా ఆలస్యం అయినా.. తరుణ్ కి కాస్త కలిసొచ్చేట్లుగానే ఉంది. ఒవియా హెలెన్ కు ఇంతకు ముందు పెద్దగా క్రేజ్ లేదు కానీ.. తమిళ్ బిగ్ బాస్ కారణంగా బోలెడంత ఫేమ్ వచ్చింది. అక్కడ పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇమేజ్ తోనే తరుణ్ తో కలిసి టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వస్తోంది ఒవియా.

హీరో - హీరోయిన్లు ఇద్దరూ విభిన్న గెటప్ లలో కనిపిస్తున్నారు. ఇటు యాక్టింగ్.. అటు గ్లామర్.. రెండు జోనర్స్ ను ఈ భామ బాగానే మెప్పించింది. తరుణ్ కూడా కాలానుగుణంగా తనను జనాలు మెచ్చిన రీతిలోనే కనిపించాడు. 'ఎప్పుడు అబ్బాయిలే దేవదాసులు అవ్వాలా.. మనం కూడా అయిపోతే పోలా' అంటూ హీరోయిన్ అడిగిన విధానం బాగుంది. '5వేలు ఇస్తే దేవుడినే ఇంటికి తీసుకొస్తారు.. కానీ జీవితం మొత్తం ఇచ్చినా.. అమ్మాయిలు మాత్రం వెయిట్ చేయిస్తూనే ఉంటారు ' అంటూ హీరో చెప్పిన డైలాగ్ తో కథను తెలిపారు దర్శకత ద్వయం రమేష్ -గోపి.


Full View
Tags:    

Similar News