కరోనా లాక్ డౌన్ కారణంగా జనాలు గతేడాది సినీ వినోదానికి దూరమయ్యారు. అయితే లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్స్ రీ ఓపెన్ చేసిన వెంటనే సినిమా సందడి మొదలైంది. థియేటర్స్ లో సినిమా విడుదలైతే చాలు టాక్ తో రివ్యూస్ తో సంబంధం లేకుండా సినిమాలు చూసేస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో శుక్రవారం రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకున్న 'జాంబీరెడ్డి' సినిమా కలెక్షన్స్ కూడా ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తేజ సజ్జ ని హీరోగా పరిచయం చేస్తూ 'అ' ఫేమ్ ప్రశాంత్ వర్మ రూపొందించిన చిత్రం 'జాంబీ రెడ్డి'. దక్ష - ఆనంది కథానాయికలుగా నటించారు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు ఓవర్ సీస్ లో పెద్దగా కలెక్షన్స్ రాకపోయినా.. ఇక్కడ మాత్రం కలెక్షన్స్ బాగానే ఊపందుకున్నాయి. తొలి రోజు డల్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ చేసిన 'జాంబీరెడ్డి' ఆ తరువాత మొల్లిగా పుంజుకున్నాడు. మొదటి నాలుగు రోజుల్లో ఈ చిత్రం 4.74 కోట్ల షేర్ ను రాబట్టినట్లు తెలుస్తోంది.
లాంఛింగ్ హీరోకి ఈ మొత్తం ఎక్కువే అని చెప్పవచ్చు. ఇక 'జాంబీ రెడ్డి' చిత్రానికి 4.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే దిశగా పయనిస్తోంది. మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయిందని టాక్ నడుస్తోంది.