స్టేజ్‌ పై సీనియర్‌ నటిపై ఇళయరాజా సీరియస్‌

Update: 2019-03-04 12:04 GMT
మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజాకు ఇటీవల తమిళ సినీ పరిశ్రమ ఘన సన్మానం చేసిన విషయం తెల్సిందే. తమిళ సినీ తారలతో పాటు టాలీవుడ్‌ నుండి కూడా సన్మాన కార్యక్రమంలో తారలు పాల్గొనడం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమంలో జరిగిన ఒక చిన్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సన్మాన కార్యక్రమంకు వ్యాఖ్యతగా సీనియర్‌ నటి రోహిణి వ్యవహరించిన విషయం తెల్సిందే. ఆమె సరదాగా చేసిన ఒక వ్యాఖ్య ఇళయరాజాకు కోపం తెప్పించింది.

ఇళయరాజా గురించి శంకర్‌ గారితో మాట్లాడించే సమయంలో రోహిణి మీరు ఎందుకు రాజాగారితో సినిమా చేయలేదు, మీ కాంబో గురించి అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ అడిగింది. అప్పుడు వెంటనే ఇళయరాజా రియాక్ట్‌ అయ్యారు. ఆయన మాట్లాడుతూ... నాకే ఛాన్స్‌ ఇప్పిస్తున్నావా, ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు, ఇప్పుడు సినిమాల ప్రస్థావన అస్సలు వద్దు. ఆయన ఎవరితో పని చేయాలనుకునేది ఆయన వ్యక్తిగతం. ఇలాంటి ప్రశ్నలు అడిగి వారిని ఇబ్బంది పెట్టవద్దు అంటూ ఇళయరాజా అన్నాడు. అందరి ముందు అలా మైక్‌ లో ఇళయరాజా అనడంతో అంతా అవాక్కయ్యారు.

తన ఉద్దేశ్యం అది కాదు అంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆయన మాత్రం ఇలాంటివి వద్దంటూ కార్యక్రమం కొనసాగించాలని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. రోహిణి అడిగిన ప్రశ్నకు శంకర్‌ సమాధానం చెప్పారు. తాను చేసిన జెంటిల్‌ మన్‌ సినిమాకు ఇళయరాజా గారితో వర్క్‌ చేయాలి అనుకున్నాను. కాని కుదరలేదు. ఆయన గొప్ప వారు, ఆయనతో మాట్లాడేందుకు నాకు భయం, అందుకే ఆయనతో సినిమాలు చేయలేదంటూ శంకర్‌ చెప్పడంతో వివాదం మెల్లగా సమసి పోయి కార్యక్రమం పూర్తి అయ్యింది.
Tags:    

Similar News