వ‌ర్మ చెప్పిన ఇళ‌యారాజా క‌థ‌

Update: 2022-05-05 14:30 GMT
వివాదాస్ప‌ద అంశాల‌నే త‌న సినిమాల‌కు క‌థ వ‌స్తువులుగా ఎంచుకుంటూ వివాదాస్ప‌ద చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్నారు రామ్‌ గోపాల్ వ‌ర్మ‌. గ‌త కొంల కాలంగా వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతూ వివ‌దాల‌తో స‌వాసం చేస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న ట్వీట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయ‌న తెర‌కెక్కించిన తాజా చిత్రం 'మా ఇష్టం'. ఇద్ద‌రు లెస్బియ‌న్ యువ‌తుల క‌థ‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం రిలీజ్ ప‌రంగా గ‌త కొన్ని రోజులుగా తీవ్ర అడ్డంకుల్ని ఎదుర్కొంటోంది.

నైనా గంగూలీ, అప్స‌రా రాణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని ఇటీవ‌ల మా థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌లేమంటూ పీవీఆర్ సినిమాస్ గ్రూప్ ప్ర‌క‌టించి షాకిచ్చింది. లెస్బియ‌న్ ల సినిమాని మా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌లేమంటూ వ‌ర్మ‌కు గ‌ట్టి షాకిచ్చింది. దీంతో రిలీజ్ కు రెడీ చేసుకున్న 'మా ఇష్టం చిత్రాన్ని వ‌ర్మ అర్థాంత‌రంగా వాయిదా వేయాల్సి వ‌చ్చింది. ఇలా త‌న సినిమా రిలీజ్ కు మ‌ల్టీప్లెక్స్ సంస్థ ఇలా అడ్డంకులు సృష్టించ‌డాన్ని వ‌ర్మ ట్విట్ట‌ర్ వేదిక‌గానే ప్ర‌శ్నించి త‌న ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కారు.  

ఇది క‌రెక్ట్ కాద‌ని, అడ్డంకులు సృష్టించి త‌న సినిమా విడుద‌ల‌ని ఆప‌లేర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎట్ట‌కేల‌కు వివాదం స‌ద్దుమ‌న‌గ‌డంతో 'మా ఇష్టం' చిత్రాన్ని మే 6న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. దేశంలో మొట్ట‌మొద‌టి సారి తెలుగులో లెస్బియ‌న్ క‌థాంశంతో రూపొందిన సినిమా కావ‌డంతో ఈ చిత్రం కోసం యూత్ లో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో వ‌ర్మ ఇద్ద‌రు హీరోయిన్ ల‌తో క‌లిసి సినిమాని ప్ర‌మోట్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

గురువారం హైద‌రాబాద్ లోని అంబేద్క‌ర్ యూనివ‌ర్సిటీలో ఈ చిత్ర ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు స్టూడెంట్స్ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పారు. ఇదే సంద‌ర్భంగా ఓ అభిమాని మీలా ఇష్టం వ‌చ్చిన‌ట్టు బ్ర‌త‌కాలంటే ఏం చేయాల‌ని, మీకు డ‌బ్బు వుంది కాబ‌ట్టే ఇష్టం వ‌చ్చిన‌ట్టు బ్ర‌తుకుతున్నార‌ని వ‌ర్మ‌ని సూటిగా  ప్ర‌శ్నించాడు.

దీంతో వ‌ర్మ కొన్నేళ్ల క్రితం ఇళ‌య‌రాజా, గంగై అమ‌ర‌న్ మ‌ధ్య జ‌రిగిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ‌ని చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లో ఇళ‌య‌రాజా ఊళ్లో వుండే వార‌ట‌. ఆ స‌మ‌యంలో గంగై అమ‌ర‌న్ ఊళ్లో ఎందుకు చెన్నై వ‌చ్చేయ్ నీకున్న టాలెంట్ కు ఎక్క‌డో ఒక‌చోట ప‌ని చూస్తాన‌ని అన్నార‌ట‌.

దానికి ఇళ‌య‌రాజా 'అస‌లు ఊర్లోనే నేను బ్ర‌త‌క‌లేక‌పోతున్నాను. చెన్నై వ‌చ్చి ఎలా  బ‌తుకుతాను' అన్నార‌ట‌. దానికి గంగై అమ‌ర‌న్ చెన్నైలో కుక్క కూడా బ‌తుకుతుంది' అన్నార‌ట‌. ఆయ‌న మాట‌ల వ‌ల్లే ఇళ‌య‌రాజా ఊరు వ‌దిలి చెన్నై వ‌చ్చి రిస్క్ చేశార‌ట‌. రిస్క్ చేశారు కాబ‌ట్టే ఆయన స‌క్సెస్ అయ్యార‌ని చెప్పుకొచ్చారు వ‌ర్మ‌.

Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News