ఇలియానాను ఇంకా మర్చిపోలేదా?

Update: 2015-07-01 05:14 GMT
అప్పట్లో ఏదో ఒక రూమర్‌ వచ్చింది.. ఇలియానా ఒక ఐటెం నెంబర్‌ చేస్తోంది అంటూ ఒక రూమర్‌ వచ్చేసింది. ఇంకేముంది అది నిజమే అంటూ కొంతమంది పండుగ చేసుకున్నారు కూడా. నేనా ఐటెం నెంబరా.. హా హా హా.. అంటూ ఇలియానా సెలవిచ్చేసరికి మనోళ్ళు షాక్‌ తినేశారు. ఆ మధ్యన ట్విట్టర్‌లో నానా హడావుడి చేసే ఈ భామ, సడన్‌గా సైలెంట్‌ అయ్యింది. ప్రేమ గురించి ట్వీట్లు ఆపేసింది. అద్గది.. మళ్ళా మొదలైంది. అసలు ఆమె ఐటెం సాంగ్‌కు, ఈ ట్వీట్స్‌ ఆపేయడానికి లింకేంటి?

అబ్బే ఏం లేదండీ... ఆ మధ్యన అస్సలు టాలీవుడ్‌ ఆఫర్స్‌ అంటేనే పెద్దగా కన్సిడర్‌ చేయలేదు ఈ బంగారం. నడుం సోయగంతో మరోసారి సొగసులు ఆరబోయించాలని ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా తెలుగోళ్లకి నా నడుం ఒక్కటే కావాలి.. నాకా సినిమాలు వద్దు అనేసింది. కాకపోతే అమ్మడు ఈ మధ్యన లవ్‌ గురించి కాస్త తక్కువగా మాట్లాడుతోంది కాబట్టి, ఒకవేళ బ్రేకప్‌ అయ్యిందేమో అని మనాళ్ళు ఆశపడుతున్నారు. ఎందుకంటే మన దగ్గర బ్రేకప్‌ అయిన భామలకు సినిమా ఆఫర్లు బాగానే వస్తాయి. ఏమ్మా నయనతారా అంతే కదూ??

ఇకపోతే ఇంకా ఇలియానాతో ఐటెం సాంగ్‌ చేయించాలని అనుకోవడం వింతగా ఉంది. అసలు ఈపాటికే జనాలు ఆమెను మర్చిపోయారు కూడా. కొత్త కొత్త హీరోయిన్లు చాలామందే ఉన్నారు. తమన్నా, శృతిహాసన్‌ వంటి భామలు కూడా ఐటెం సాంగ్స్‌ చేస్తున్నారు. ఇంకా పాత సరుకు ఎందుకు గురూ?

Tags:    

Similar News