అతడు అన్నా.. నో ఛాన్స్ అంటున్న ఇల్లీ

Update: 2015-08-27 18:17 GMT
రామ్ గోపాల్ వర్మకు ఆయన సినిమాల్లో పని చేసిన హీరోయిన్లందరితోనూ ఎఫైర్ లున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఇదే విషయం ఆయన్నడిగితే.. నాతో కలిసి పని చేసిన హీరోయిన్లందరూ నాకు తోబుట్టువులతో సమానం అని అందరికీ దిమ్మదిరిగే స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. ఈ స్టేట్ మెంట్ లో ఎంత నిజం ఉందో వర్మకు, ఆ హీరోయిన్లకు.. పైనున్న ఆ దేవుడికే తెలియాలి. వర్మ సంగతి పక్కనబెట్టేస్తే నీ పక్కన నటించిన ఏ హీరోనైనా నువ్వు సోదరుడిగా భావిస్తావా అని గోవా బ్యూటీ ఇలియానాను అడిగితే మాట వరసకు కూడా తానలా అనుకోనని కుండబద్దలు కొట్టేసింది. రొమాన్స్ చేసిన హీరోల్ని అన్నగా ఎలా అనుకోమంటారు అని ప్రశ్నించింది ఇల్లీ బేబీ.

ఏ హీరోనైనా బ్రదర్ గా భావించడం సంగతటుంచితే.. ఎవరినైనా ఆ స్థానంలో ఊహించుకుంటారా అంటే.. మిగతా వాళ్ల సంగతేమో కానీ తన తొలి బాలీవుడ్ సినిమా హీరో రణబీర్ విషయంలో మాత్రం పొరబాటున కూడా ఆ మాట ఎత్తొద్దని అంటోంది. ‘‘రణబీర్ ను మాత్రం ఊహల్లో కూడా సోదరుడికి భావించలేను. అది చాలా చాలా కష్టం’’ అని చెప్పేసింది ఇలియానా. తెలుగులో అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో రణబీర్ హీరోగా నటించిన ‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఇలియానా. ఆ సినిమా సూపర్ హిట్టవడమే కాక.. ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చాక్లెట్ బాయ్ రణబీర్ తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కవుటైందన్న కామెంట్స్ వినిపించాయి. రణబీర్ తో కలిసి నటించినా నటించకపోయినా అంత అందగాణ్ని ఏ అమ్మాయైనా సోదరుడిగా ఎలా భావిస్తుంది?
Tags:    

Similar News