ఫోటో స్టోరి: ఇల్లీ బేబీ ఇంత ఓపెన్ గా ఉన్నా!

Update: 2020-02-21 10:15 GMT
వ్య‌క్తిగ‌త జీవితం వృత్తిని తీవ్రంగానే ప్ర‌భావితం చేస్తుంది. డిస్ట్ర‌బెన్సెస్ అనేవి అన్నిర‌కాలుగా దెబ్బ కొడ‌తాయి. ఆ కోణంలో చూస్తే బాగా డిస్ట్ర‌బ్ అయిన భామ‌ల్లో ఇలియానా పేరు జాబితాలో టాప్ లో ఉంటుంది. ప్రియుడు ఆండ్రూ నీబోన్ నుంచి విడిపోయాక ఇలియానా స్పీడ్- ఎన‌ర్జీ ఏ రేంజులో ప‌డిపోయాయో చూస్తున్న‌దే. అస‌లు కొత్త సినిమాల‌కు సంత‌కాలు చేయ‌డంలో ఇంత‌కుముందు ఉన్న స్పీడ్ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు.

డిప్రెష‌న్ లో అన్నిటినీ వ‌దులుకుంది. ఇక ఇంత‌కుముందులా క‌స‌ర‌త్తులు చేస్తున్నా కానీ ఫిట్ బాడీని తిరిగి తేలేక‌పోతోంది. ఇదిగో లేటెస్టుగా రిలీజైన ఈ ఫోటో చూడ‌గానే అభిమానుల‌కు ర‌క‌ర‌కాల సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. ఇల్లీబేబీ ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ కోసం ఇంత‌కుముందులానే శ్ర‌మిస్తున్నా ప్ర‌యోజ‌నం మాత్రం క‌నిపించ‌డం లేదు. ఆ న‌డుము సొగ‌సును పెంచే ప్యాకింగ్ ఎక్స్ ర్ సైజుల చేస్తున్నా.. మ‌రోవైపు కొలెస్ట‌రాల్ అన్ కంట్రోల్డ్ గా మారింది.

ఇలియానా వైట్ అండ్ వైట్ లో ఇలా షికారుకు వెళుతూ ఉంటే బొద్దుత‌నం బ‌య‌ట‌ప‌డింది. టాప్ టు బాట‌మ్ గ్లామ‌ర్ డోస్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. పైగా ఆ బొద్దందం వ‌ల్ల ఏమంత కొత్త‌ద‌నం క‌నిపించ‌డం లేదు. ఆర‌బోత విష‌యంలో ఎంత ఓపెన్ గా ఉన్నా కానీ ఏం లాభం?  పాపం ఇలియానాను చూసేందుకే ఎవ‌రూ లేరు. ఇటీవ‌ల సినీఛాన్సులు లేక‌పోవ‌డానికి కార‌ణం కూడా ఇదే. ఇల్లీ బేబీ బాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా చేస్తోంది. టాలీవుడ్- కోలీవుడ్ లో యువ‌త‌రం నాయిక‌లు పాపుల‌రైపోవ‌డంతో ఇల్లీకి ఛాన్స్ అన్న‌దే లేకుండా పోయింది. క‌నీసం క‌థానాయిక‌ల్ని వెతుకుతున్న బోయ‌పాటి లాంటి డైరెక్ట‌ర్ అయినా ఇలియానాని పిలిచి ఓ ఆఫ‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డం విస్మ‌య‌ప‌రుస్తోంది మ‌రి.


Tags:    

Similar News