సముద్రం నుంచి తీసేసుకుంటున్న ఇల్లీ

Update: 2017-08-24 17:16 GMT
గోవా బ్యూటీ ఇలియానాకు బీచ్ లు అంటే మహా పిచ్చి. తనకు తానే బీచ్ బం అని అభివర్ణించుకోవడం.. ఈ భామ స్పెషాలిటీ. తన బక్కపలచని దేహంతోనే.. బోలెడన్ని అందాలను ఆరబోయడంలో ఇల్లీ బాగా ముదిరిపోయింది.

కెరీర్ స్టార్టింగ్ నుంచే గ్లామర్ డాళ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఇలియానా.. ఆ తరహా ఇమేజ్ తో ఏ మాత్రం ఇబ్బంది పడలేదు సరికదా.. తనకు వచ్చిన ఇమేజ్ తోనే తెగ రెచ్చిపోయింది. సోయగాలను కెమేరా ముందు ధారపోసేసింది. అయితే.. ఇల్లీ అందాలను పర్ఫెక్ట్ గా కెమేరాతో చూపించడం మాత్రం.. ఆమె ఆస్ట్రేలియన్ లవర్ అండ్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తోనే మొదలైందని చెప్పచ్చు. స్వయానా లవర్ తో తీయించుకుంటున్న ఫోటోలు కావడంతో మహా ఘాటైన అందాలను.. ఇంపుగా ప్రదర్శించేస్తోంది ఇల్లీ.

రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసి ఫిజీ టూర్ వెళ్లగా.. అక్కడి నుంచి కూడా బీచ్ లో ఇలియానా నుంచున్న ఫోటోనే నెట్ లో దర్శనం ఇచ్చింది. పైగా విటమిన్ సీ(sea) తీసుకుంటున్నానంటూ.. భావుకత కూడా ప్రదర్శిస్తోంది బక్క భామ ఇలియానా. ఏమైనా ఫోటో తీసేవాడు మనవాడైతే.. ఎలా ఉన్నా ఫోటో అందంగానే కనిపిస్తుందిలే!
Tags:    

Similar News