పిచ్చి ప్రపంచంలో ఇల్లి లిప్ కిస్

Update: 2017-09-18 07:36 GMT
దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి తనదైన శైలిలో సినిమాలను తీసి విజయాలను అందుకున్న భామ ఇలియానా. సన్నని నడుముతో టాలీవుడ్ బడా హీరోలందరితో రొమాన్స్ చేసిన ఇల్లి ప్రస్తుతం బాలీవుడ్ ని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు తెగ ప్రయాత్నాలు చేస్తోంది. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా తన గ్లామర్ టచ్ తో అక్కడి హీరోలకి భాగనే గాలం వేస్తోంది.

రీసెంట్ గా బాలీవుడ్ లో బాద్షాహో సినిమాను రిలీజ్ చేసి ఇలియానా అందరిని ఆకట్టుకుంది. తన అందాలతో సినిమాకి బాగానే కలెక్షన్స్ ని రప్పించింది. ఇక అమ్మడు గత కొంత కాలంగా ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ న్నిబోన్ తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఒక స్టార్ హోటల్ లో అమ్మడు ఎప్పుడు లేని విధంగా బాయ్ ఫ్రెండ్ కి లిప్ కిస్ ఇచ్చింది. ఫోటో అందంగా రావడంతో దాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే కాకుండా "పిచ్చి ప్రపంచంలో.. ఒక చిన్న మూమెంట్" అని భావాన్ని చెప్పుకునేలా క్యాప్షన్ ఇచ్చింది.

దీంతో సోషల్ మీడియాలో ఆ ఫోటో ప్రస్తుతం చాలా వైరల్ గా మారింది. సాధారణంగా తన బాయ్ ఫ్రెండ్ విషయాల్ని ఇల్లి బయటపెట్టడానికి ఇష్టపడనని చాలా సార్లు చెప్పింది. కానీ ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో లిప్ లాక్ ఫోటోని పెట్టి షాక్ ఇచ్చింది. ఇక అమ్మడి సినిమాలు విషయానికి వస్తే బాలీవుడ్ లో మరోసారి అజయ్ దేవగన్ తో నటిస్తోంది. రైడ్ అనే ఆ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక తెలుగులో మారో సారి స్టార్ హీరోస్ తో నటించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.      



Tags:    

Similar News