ఫోటో స్టోరీ: హాట్ హాట్ బంగారం

Update: 2018-08-24 06:50 GMT
పన్నెండేళ్ల క్రితం అంటే 2006లో వైవిఎస్ చౌదరి దేవదాస్ సినిమాలో హీరో రామ్ అప్పుడే టాలీవుడ్ కు పరిచయమైన ఇలియానాను చూసి బంగారం సింగారం అంటూ పాట పాడుకుంటే ప్రేక్షకులు కూడా నిజమే కదా అనుకున్నారు. సన్నని నాజూకు నడుముతో బక్కపల్చని సౌందర్యంతో ఫ్రెష్ బ్యూటీగా పరిచయమైన ఇల్లిపై మహేష్ అంతటి వాడే మనసు పారేసుకుని పోకిరిలో దేవదేవుడా అంటూ పాటేసుకున్నాడు. చాలా కాలం అగ్ర హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసిన ఇలియానా గత ఐదారేళ్ళగా కొత్త హీరోయిన్ల తాకిడికి ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ లోనే సెటిలైపోయింది. ఆ మధ్య రెండు మూడు తెలుగు సినిమాలు ట్రై చేసినా అంతగా వర్క్ అవుట్ కాలేదు. తాజాగా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ తో రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా ఇది తనకు గట్టి బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉంది. సరే ఛాన్సులు లేవు కదా అని ఇలియానా తన శరీరం మీద ఏనాడూ నిర్లక్ష్యం వహించలేదు.

అది ఋజువు చేయటం కోసమని కాబోలు ఇన్స్ టాగ్రామ్ లో హాట్ ఫోటో ఒకటి షేర్ చేసుకుంది ఇలియానా. వైట్ టూ పీస్ బికినీలో పైన ట్రాన్స్ పరెంట్ జర్కిన్ తో ఇలియానా ఇచ్చిన స్టిల్ అభిమానులను ఫిదా చేసేస్తోంది.గల గల గోదారి పాటలో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా నడుమును అలాగే మైంటైన్ చేయటం చూసి ఫ్యాన్స్  ఆశ్చర్యపోతున్నారు. ఇలా అనుమానం వస్తుందని ముందే ఊహించింది కాబోలు ఇందులో ఎలాంటి ఎఫెక్ట్స్ ఫోటో షాప్ వాడలేదని ముందే క్లారిటీ ఇచ్చేస్తోంది. సో రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీలో కూడా ఇలాంటివి ఆశించవచ్చన్న మాట. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన కిక్ బ్లాక్ బస్టర్ గా నిలవగా ఆ తర్వాత చేసిన ఖతర్నాక్-దేవుడు చేసిన మనుషులు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు ఇది కనక హిట్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేయొచ్చనే  అంచనాలో ఉంది ఇలియానా.
Tags:    

Similar News