ఫోటో స్టొరీ: బాయ్ ఫ్రెండ్ చేతిలో చెయ్యేసి..

Update: 2018-09-18 10:24 GMT
లవ్ లో ఉన్నప్పుడు లోకం అంతా చాలా అందంగా కనిపిస్తుంది.. వెయిటింగ్ అందంగా ఉంటుంది.. మీటింగ్ అందంగా ఉంటుంది.. ఆఖరికి ఫైటింగ్ కూడా.  ఇక గోవా సుందరి ‎ఇలియానా ప్రస్తుతం అదే రకమైన ప్రేమ జగత్తులో మునిగితేలుతున్నట్టుగా ఉంది.  చాలా ఏళ్ళనుండి అండ్రూ నీబోన్ అనే ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ తో చెట్టాపట్టాలేసుకొని ఈ బ్యూటీ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో జంటగా కనబడ్డారు.

ఇద్దరూ చేతిలో చెయ్యేసుకొని నవ్వుతూ తుళ్ళుతూ ఫొటోగ్రాఫర్స్ కు పోజిచ్చారు.  అండ్రూ జీన్స్ ప్యాంట్ - డార్క్ కలర్ షర్టులో క్యాజువల్ లుక్ తో కనిపించాగా.. ఇలియానా కలర్ ఫుల్ స్ట్రైప్స్ ఉన్న గౌన్ లో అందంగా కనిపించింది.  ఫోటో చూస్తుంటే ఇది ప్రేమ జంటేనా లేదా పెళ్లయిన జంటా అనే అనుమానం వస్తోంది.  సహజంగా ప్రేమ జంటలు ఫోటోకు ఇంత క్యాజువల్ గా ఫోజు ఇవ్వరు.  ఇద్దరికీ ఆల్రెడీ పెళ్ళయిందని గతంలో వార్తలు వచ్చాయి గానీ వాళ్ళిద్దరూ అవన్నీ రూమర్స్ అని తోసిపుచ్చారు. పెళ్లి విషయంలోనే కాదు..  ఇల్లీ బేబీకి ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా వార్తలు వచ్చాయి.  ఇల్లీ బేబీ నేను ప్రెగ్నెంట్ కాదని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

ఇలియానా సినిమాల విషయానికి వస్తే రవితేజ తాజా చిత్రం 'అమర్ అక్బర్ అంటోని' లో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాతో టాలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇస్తోంది.  మరి ఈ సినిమాతో మరి సక్సెస్ సాధిస్తుందా.. హీరోయిన్ గా మళ్ళీ బిజీ అవుతుందా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News