పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయ్యి కొంత మేరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కరోనా సెకండ్ వచ్చి ఉండకుంటే సినిమాను సంక్రాంతికి విడుదల చేసి ఉండే వారు. కాని కరోనా వల్ల గత కొన్ని నెలలుగా సినిమా షూటింగ్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది.
ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా షూట్ లో ఉన్న పవన్ జనవరి నుండి హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో సినిమా కు ఒక ఈడీ కేసు చిక్కులు తెచ్చి పెట్టింది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆర్థిక నేరంతో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెను ఈడీ విచారిస్తూ ఉంది. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు.. కాని ఆమె ను హరి హర వీరమల్లు సినిమాలో నటింపజేయడం అనేది ఈ సమయంలో కరెక్ట్ కాదు అంటూ మేకర్స్ వెనక్కు తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది.
సినిమాలోని ఆ కీలక పాత్రకు ఆమె నటించడం వల్ల బిజినెస్ పరంగా అన్ని విధాలుగా హెల్ఫ్ అవుతుందని అంతా భావించారట. కాని పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు. దాంతో చేసేది లేక మరో హీరోయిన్ ను అది కూడా బాలీవుడ్ హీరోయిన్ నే ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
జాక్వెలిన్ కు రిప్లెస్ గా కత్రీనా కైఫ్ లేదా నర్గీస్ ఫక్రీ ని ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరిలో ఒకరిని త్వరలోనే అధికారికంగా కన్ఫర్మ్ చేస్తారని తెలుస్తోంది. జనవరి లేదా ఫిబ్రవరిలోనే వారు షూటింగ్ లో కూడా జాయిన్ అవ్వాల్సి ఉందట. మొత్తానికి జాక్వెలిన్ పై ఈడీ కేసు వల్ల హరి హర వీరమల్లు సినిమా కు పెద్ద చిక్కు వచ్చి పడింది.
ఇప్పటికే జాక్వెలిన్ తో ఒప్పందం చేసుకుని ఆమె మేకప్ టెస్ట్ ఇతర విషయాల్లో టెస్టులు కూడా జరిగాయట. కాని ఈడీ కేసు వల్ల సినిమా మేకర్స్ ఆమెను కాదనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై మరింత స్పష్టత చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా స్పందిస్తే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.