ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్.. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫస్ట్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా బయోపిక్ పట్టాలెక్కబోతుంది. ఈ బయోపిక్ ను లేడీ డైరెక్టర్ ఫరా ఖాన్ తెరకెక్కించబోతున్నారు. ఈమద్య కాలంలో బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో కూడా బయోపిక్ లు తెరకెక్కతున్నాయి. బయోపిక్ ల్లో ఎక్కువ శాతం భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ఏడాదికి అయిదు ఆరు బయోపిక్ లు వెండి తెరపై పడుతూనే ఉన్నాయి. చిన్నా చితకా కలిపి చాలా బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. తాజాగా రాజేష్ ఖన్నా బయోపిక్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
1942 డిసెంబర్ 29న అమృత్ సర్ లో జన్మించిన రాజేష్ ఖన్నా సినీ రంగ ప్రవేశం చేసిన కొన్నాళ్లకే సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. మూడు దశాబ్దాల పాటు ఆయన సినిమాలు ఇండియన్ సినీ అభిమానులను ఉర్రూతలూగించాయి. భాష తో సంబంధం లేదు అన్నట్లుగా ఆయన సినిమాలు సాగాయి. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులకు ఆయన అభిమాన తార అనడంలో సందేహం లేదు. ఎంతో మంది గతంలో రాజేష్ ఖన్నా మాకు సూపర్ స్టార్ అంటూ కామెంట్స్ చేసిన సందర్బాలు ఉన్నాయి.
ఇండియన్ వెండి తెరపై తనదైన ముద్రను వేసి.. ఇండియన్ సినిమా బతికి ఉన్నంత కాలం తన సినిమా లతో బతికే ఉండే రాజేష్ ఖన్నా జీవితంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనల సమాహారంగానే ఈ బయోపిక్ ను తెరకెక్కించబోతున్నట్లుగా ఫరా ఖాన్ తెలియజేశారు. రేపు వర్ధంతి సందర్బంగా మరిన్ని విషయాలను వెళ్లడించే అవకాశం ఉంది. సినిమా ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్ వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమా ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రాజేష్ ఖన్నా బయోపిక్ పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యే అవకాశం ఉంది.