భారతీయుడు 2 .. ఇన్నాళ్లు ఊరించిన వ్యవహారం. భారతీయుడు అభిమానులకు కంటిమీద కునుకుపట్టనివ్వని ఆలోచన. ఇక అది ఆలస్య ం కాదని అర్థమవుతోంది. మొత్తానికి భారతీయుడు ఈజ్ బ్యాక్. సేనాపతి ఈజ్ బ్యాక్. కలరి స్టైల్లో కత్తిపోటు ఖాయమైనట్టే. ఆ మేరకు చేతి వేళ్లను మడతపెట్టి భారతీయుడు ప్రిపేర్డ్ గా ఉన్నాడు.
ఇదిగో ఇప్పుడు ఆ స్టిల్‌ని రిలీజ్ చేసింది శంకర్ బృందం. కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ బృందం అన్ని రకాల ఏర్పాట్లలో ఉంది. ఆ మేరకు అధికారికంగా భారతీయుడు 2 ప్రీలుక్ ని రివీల్ చేశారు. ఈ లుక్ అభిమానుల్లో సునామీలా దూసుకుపోతోంది. ఎన్నాళ్లయ్యింది అలాంటి విద్యను ప్రదర్శించే .. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వీరుడు బరిలో దిగి. దాదాపు 22 ఏళ్లయ్యింది భారతీయుడు సినిమా రిలీజై. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రావాల్సిన టైమ్ ఆసన్నమైంది. మాయదారి లోకంలో మోసాలు - అవినీతి పెట్రేగిపోతున్నాయి. అధికారులు - రాజకీయ నాయకుల్లో లంచగొండి తనం అంతకంతకు పెట్రేగిపోతోంది. ప్రభుత్వాలే ఏమార్చేస్తున్నాయి. బ్యాంకులు నిలువునా ముంచేస్తున్నాయి. అన్నీ ఆర్థిక నేరాలే. హైటెక్ అవినీతి రాజ్యమేలుతోంది. అందుకే ఇప్పుడు పోటు పొడవాల్సిన టైమ్ వచ్చింది.
ఆ టైమ్‌ని తెచ్చాడు శంకర్. రోబో 2 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా భారతీయుడు చేతివేళ్లు మడతపెడుతూ ఉన్న లుక్ ని రివీల్ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ఈ సినిమా మెజారిటీ పార్ట్ తెరకెక్కనుంది. ఇప్పటికే రామోజీ ఫిలింసిటీ సహా సిటీలో చాలా చోట్ల లొకేషన్ల వేట చేశారు శంకర్. ఈ సినిమాని తమిళ్ - తెలుగులో సైమల్టేనియస్ గా తెరకెక్కించనున్నారు. అలానే తమిళ్ సహా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రను పోషించనున్నారని తమిళ మీడియా పేర్కొంది. ఈ ఏడాది నవంబర్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనున్నారని తెలుస్తోంది.