కమెడియన్‌ ను నిషేదించిన విమానయాన సంస్థలు

Update: 2020-03-14 13:32 GMT
బాలీవుడ్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రాపై పలు విమానయాన సంస్థలు నిషేదం విధించాయి. మొదట ఇండిగో సంస్థ ఆయనపై నిషేదం విధించగా ఆ తర్వాత ఇతర సంస్థలు కూడా ఈయన్ను నిషేదిస్తున్నట్లుగా ప్రకటించాయి. ఈయన నిషేదంకు కారణం ఈ ఏడాది జనవరి 28న ఇండిగో విమానంలో ప్రయాణిస్తూ ఒక న్యూస్‌ యాంకర్‌ తో అనుచితంగా ప్రవర్తించాడట. ఆ యాంకర్‌ ఫిర్యాదు చేయడం తో విచారణకు ఆదేశించిన ఇండిగో ఈ నిషేదం విధించినట్లుగా సమాచారం.

ఇండిగో అంతర్గత విచారణలో కునాల్‌ కమ్రా తప్పు చేసినట్లుగా తేలిందని ఒక అధికారి తెలిపారు. మొదట ఆరు నెలల పాటు ఈయనపై నిషేదం విధించాలని నిర్ణయించినా ఆ తర్వాత మూడు నెలలకు దాన్ని కుదించినట్లుగా చెప్పుకొచ్చారు. కునాల్‌ ఇండిగో నిషేదంను ఎయిర్‌ ఇండియా.. గోఎయిర్‌.. స్పైస్‌ జెట్‌ ఇంకా విస్తారాలు కూడా ఈయన్ను నిషేదిస్తున్నట్లుగా ప్రకటించాయి. ఇతర సంస్థలు నిషేదం విధించడంపై కునాల్‌ సోషల్‌ మీడియా లో అసహనం వ్యక్తం చేశారు. అయినా నిషేదం వల్ల తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని.. తాను మాత్రం క్షమాపణ చెప్పను అంటూ తేల్చి చెప్పాడు.
Tags:    

Similar News