హాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్ `ది గేమ్ ఆఫ్ థ్రోన్స్`. ఈ సిరీస్ లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన ఈ ఫాంటసీ సిరీస్ కు ప్రీక్వెల్ గా `హౌస్ ఆఫ్ ద డ్రాగన్`ని రూపొందించారు. HBOలో ఈ సిరీస్ ప్రసారం అవుతోంది. వీక్షకుల నుంచి ఈ లేటెస్ట్ సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సిరీస్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని తాజాగా మేకర్స్ బయట పెట్టారు.
`హౌస్ ఆఫ్ ద డ్రాగన్` సిరీస్ కి సంబంధించిన ఎనిమిదవ ఎపిసోడ్ మన భారతీయ సంతతికి చెందిన యువతి డైరెక్ట్ చేసినట్టుగా తెలిసింది. ఆమె పేరు గీతా వసంత్ పటేల్. `హౌస్ ఆఫ్ ద డ్రాగన్`కు వర్క్ చేయడానికి ముందు గీతా వసంత్ పటేల్ పలు ఫీచర్ ఫిలింస్ కి పని చేసిందని తెలిసింది. అంతే కాకుండా తన సోదరుడు రవి పటేల్ తో కలిసి `ప్రాజెక్ట్ కశ్మీర్`ని చేసిందట. `మీట్ ద పటేల్స్` వంటి సినిమాలని తెరకెక్కించిన గీతా వసంత్ పటేల్ ఎమ్మీ నామినేషన్ ని దక్కించుకుందట.
`హౌస్ ఆఫ్ ద డ్రాగన్` సిరీస్ కి సంబంధించిన ఎనిమిదవ ఎపిసోడ్ `ది లార్డ్ ఆఫ్ ద టైడ్స్` ని గీతా వసంత్ పటేల్ తెరకెక్కించిన తీరు, భావోద్వేగాల సమాహారంగా ఎమోషన్స్ ని పండించిన తీరు ప్రశంసలు కురిపిస్తోందని అంటున్నారు.
ఎనిమిదవ ఎపిసోడ్ లో గీతా వసంత్ పటేల్ మరింత నాటకీయతని జోడించి కథ, కథనాల్ని మరింతగా రక్తికట్టించే ప్రయత్నం చేసింది. అదే ఇప్పడు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోందని చెబుతున్నారు.
గీతా వసంత్ పటేల్ ఇంతకు ముందు హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ `ది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్` ఫ్రాంచైజీ తో పాటు `బ్లూ క్రష్` లోనూ పని చేసిందని తెలిసింది. HBOలో `హౌస్ ఆఫ్ ద డ్రాగన్` ఆగస్టు 21 నుంచి ప్రారం ప్రారంభమైంది. ఇప్పటికే గీతా వసంత్ పటేల్ డైరెక్ట్ చేసిన `ది లార్డ్ ఆఫ్ ద టైడ్స్` ఎపిసోడ్ ని 1.73 మిలియన్ యుఎస్ వీవర్స్ వీక్షించారట. 68 నిమిషాల నిడివిగల ఈ ఎపిసోడ్ అక్టోబర్ 9 న ప్రసారం అయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.