లాక్ డౌన్: పోర్న్ వీక్షణంలో ఇండియా టాప్

Update: 2020-04-13 03:00 GMT
లాక్ డౌన్ తో ప్రపంచమే బందీ అయిపోయింది. అన్ని దుకాణాలు బంద్ అయిపోయాయి. ఉద్యోగ, ఉపాధి కోల్పోయాయి. సర్వం పరిశ్రమలు, రంగాలాన్నీ బంద్ అయిపోయి వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. కానీ ఆ రంగానికి మాత్రం లాభాలు కురిపిస్తోంది. లాక్ డౌన్ వేళ లాభాల పంట పండిస్తున్న రంగం ఏదై ఉంటుందని ఆలోచిస్తున్నారా? అదే ‘పోర్న్’ రంగం.

అవును.. లాక్ డౌన్ తో దేశం మొత్తం బంద్ అయిపోయి అందరూ ఇళ్లలోనే ఉన్నారు. టీవీ, సినిమాలు చూస్తూ ఫోన్లో ఆడుతూ ఇలా కాలక్షేపం చేస్తున్నారు. రాత్రి పగలూ లేకుండా మొబైల్ లోనే కొంత మంది గడిపేస్తున్నారట..అయితే వీళ్లు చూసేవి ఏ ఆటలో.. పాటలో, గేమ్ లో కాదు.. అంతా పోర్న్ వీడియోల్లో మునిగితేలుతున్నారట..

ప్రముఖ అడల్ట్ వెబ్ సైట్ ‘పోర్న్ హబ్’ తాజాగా విడుదల చేసిన లెక్కలు షాకింగ్ గా మారాయి. ప్రపంచంలోనే  ప్రముఖ పోర్న్ వెబ్ సైట్ అయిన ‘పోర్న్ హబ్’కు భారత్ లో మొన్నటివరకు పెద్దగా యూజర్స్ లేరు. కానీ ఇప్పుడు కరోనాతో లాక్ డౌన్ పడి అందరూ ఖాళీగా ఉండడంతో ఈ వెబ్ సైట్ ను తెగ ఓపెన్ చేస్తున్నారట..

మార్చి 1 వరకు పోర్న్ హబ్ సైట్ కు భారత్ లో కేవలం 0.8శాతం మంది మాత్రమే యూజర్స్ ఉండగా.. మార్చి 27 నాటికి అనూహ్యంగా 95.3శాతానికి పెరిగారు.  అంటే 86.4శాతం వ్యూయర్స్ పెరిగారన్న మాట.. మార్చి 27 నాటికి ఏకంగా 95.3శాతం పెరిగారు. లాక్ డౌన్ మరో రెండు వారాలు దేశంలో పెరగడంతో ఇప్పుడందరూ పోర్న్ ను మరింత చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

దీనికి కారణం ఏంటంటే.. కరోనా వైరస్ ను నియంత్రించడానికి ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయట పెట్టలేదు. దీంతో ఈ ఖాళీ సమయంలో  ‘పోర్న్ వెబ్ సైట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియాలో నిషేధం ఉన్నా లపు ఫ్రాక్ వెబ్ సైట్స్ లింక్స్ ద్వారా ఓపెన్ అవుతూనే ఉన్నాయి.  జనాలు ఖాళీగా ఇంట్లో ఉండడం తో రోజంతా సెక్స్ మాయలో పడి పోతున్నారట..
Tags:    

Similar News