ఉగ్రవాది కోసం అన్వేషణ - ట్రైలర్ టాక్

Update: 2019-05-02 10:13 GMT
వైవిధ్యతకు పెద్ద పీట వేసే బాలీవుడ్ లో టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో ఎన్ని సినిమాలు వచ్చిన్నప్పటికి ప్రతిసారి ఏదో కొత్తగా అందించే ఫీలింగ్ కలిగించడంలో వాళ్ళు చాలా నేర్పరులు. దానికి ఉదాహరణగా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ సినిమాను చెప్పుకోవచ్చు. అర్జున్ కపూర్ హీరోగా హీరొయిన్ లేకుండా రూపొందిన ఈ మూవీకి రాజ్ కుమార్ గుప్తా దర్శకుడు.

కథ విషయానికి వస్తే ఇండియాలో సీరియల్ బ్లాస్ట్ చేసి వేలాది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన టెర్రరిస్టు ఆచూకి తెలియక ఐబి డిపార్ట్ మెంట్ శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. దీన్నో సవాల్ గా తీసుకుంటాడు ప్రభాత్ కపూర్(అర్జున్ కపూర్). తనతో పాటు నలుగురిని తీసుకెళ్ళి ఎలాంటి ఆయుధాలు వాడకుండా పట్టి తెస్తానని తన పై ఆఫీసర్ కు ఛాలెంజ్ చేస్తాడు.

వాళ్ళతో ఖాట్మండు వెళ్లి వేట మొదలుపెడతాడు. కాని ఎంత ప్రమాదంలో చిక్కుకున్నా అతని బృందానికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ దక్కదు. అయినా పట్టు వదలకుండా ప్రాణాల మీదకు వచ్చినా ప్రభాత్ ముందడుగు వేస్తాడు. తీవ్రవాదిన్ని చేరుకుంటాడు. అతనే ఇండియా ఒబామా. ఇదంతా ఎలా జరిగింది అనేది తెరమీద చూడాలి

టెర్రరిస్ట్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని రాజ్ కుమార్ గుప్తా డీల్ చేసిన తీరు ఆసక్తి రేపెలా ఉంది. మసాలాలు లేకుండా ఆఖరికి ఓ పాట కోసం హీరొయిన్ ని సైతం పెట్టకుండా కేవలం థీమ్ కి కట్టుబడి సీరియస్ నేరేషన్ వైపే మొగ్గు చూపిన తీరుని మెచ్చుకోవచ్చు. పెద్దగా పరిచయం లేని నటులనే తీసుకోవడం వల్ల అర్జున్ కపూర్ ని మినహాయించి అందరూ ఫ్రెష్ గా అనిపిస్తారు. రియల్ లొకేషన్స్ కావడంతో సహజత్వం బాగా వచ్చింది. కోవర్ట్ ఆపరేషన్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది.

Full View
Tags:    

Similar News