సుధీర్ బాబును చూసి మహేశ్ బాబు గర్వపడే సినిమా ఇది!

Update: 2022-09-14 10:30 GMT
సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాను రూపొందించారు. బెంచ్ మార్క్ - మైత్రీ వారు కలిసి నిర్మించిన ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 16వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది. నాగచైతన్య .. అడివి శేష్ .. డీజే టిల్లు .. అనిల్ రావిపూడి .. హరీశ్ శంకర్  గౌరవ అతిథులుగా హాజరయ్యారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి  చాలా అందంగా మెరిసింది. ఆన్ స్క్రీన్ డైరెక్టర్  ఇంద్రగంటి గారు అనీ .. హాఫ్  స్క్రీన్ డైరెక్టర్  సుధీర్ గారు అంటూ ఆమె స్టేజ్ పావు సందడి చేసింది. కృతి మాట్లాడుతూ, ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక అమ్మాయికి ఇంద్రగంటిగారు ఇచ్చే స్పేస్ .. స్ట్రెంథ్ ఎలా ఉంటుందనేది చూసిన తరువాత  తనకి చాలా హ్యాపీ గా అనిపించిందని చెప్పారు. సుధీర్ బాబుగారితో కలిసి  నటించడం వలన తాను చాలా విషయాలను నేర్చుకున్నానని అన్నారు.

ఇంద్రగంటి మాట్లాడుతూ .. కమర్షియల్ సినిమా దర్శకుల పట్ల తనకి ఒక అపోహ ఉండేదనీ .. డబ్బు కోసమే సినిమాలు చేస్తారని అనుకునేవాడినని అన్నారు. వాళ్లలో ఉన్న ఒక కళాకారుడిని గుర్తించిన తరువాత  తన అపోహలు తొలగిపోయాయనీ, వాళ్లకి ఈ సినిమాను అంకితం చేస్తున్నానని చెప్పారు. సుధీర్ బాబు తన ఫేవరేట్ హీరో అనీ .. ఆయనకి తగిన సినిమా ఇంకా పడలేదని అన్నారు. ఈ సినిమా చేసినందుకు సుధీర్ బాబు ..  ఆయన పెర్ఫార్మన్స్ చూసి మహేశ్ బాబు గర్వపడతారని చెప్పుకొచ్చారు.

ఇక చైతూ మాట్లాడుతూ .. సుధీర్ బాబు .. తాను కలిసి మొదటిసారిగా 'ఏ మాయ చేశావే' సినిమా కోసం  పనిచేశామని చెప్పాడు. ఆ సినిమాలో కొంత సేపు కనిపించిన ఆయన, ఈ రోజున ఈ స్థాయికి ఏదిగారని అన్నాడు. ఎప్పుడు చూసినా సిక్స్ ప్యాక్ తో ఉండటం ఆయనకే సాధ్యమైందనీ .. ఆయన ఆల్ రౌండర్ అంటూ కితాబునిచ్చాడు. సాధారణంగా సహజత్వానికి దగ్గరగా నడిచే సినిమాలు ఆడియన్స్ కి అంతగా రీచ్ కావనీ, కానీ ఇంద్రగంటి సినిమాలకి అది సాధ్యమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

కృతి విషయానికి వస్తే ఆమె డెడికేషన్ చూసి తనకి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందనీ, ఆమెను చూసిన తరువాత  పాత్రల విషయంలో ఎంత కేర్ఫుల్  గా ఉండాలనేది అర్థమైందని చైతూ చెప్పాడు. ఇక హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. సుధీర్ బాబును పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా చూడాలని ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈ సినిమాలో  డైరెక్టర్ ను హీరోయిన్ లవ్ చేయడమనే పాయింట్ తనకి నచ్చిందనీ,.  హీరోయిన్లంతా ఈ అంశాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సరదాగా కామెంట్ చేస్తూ నవ్వులు పూయించాడు. ఈ నెల 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News