`జెంటిల్ మాన్` సక్సెస్‌తో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఫుల్ హ్యీపగా వున్నారు. టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్స్ సైతం విడుదలైన మొదటి రోజే ఫోన్లు చేసి అభినందించారట. అశ్వనీదత్ - దిల్ రాజు లాంటి వారు మొదటి షో చూడగానే ఫోన్ చేసి.. హిట్టు కొట్టావ్.. కంగ్రాట్స్ అన్నారట. దాంతో ఈ సక్సెస్‌ని ఒడిసిపట్టుకుని మునుముందు కెరీర్ ని పెద్ద రేంజులో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సక్సెస్ వెనక నానితో పాటు ఎవరెవరున్నారో కూడా చెప్పారు. ఇందులో కీ రోల్ పోషించిన మలయాళీ ముద్దుగుమ్మ నివేద థామస్ ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చిందో వెళ్లడించారు.
ఇంద్రగంటి మాట్లాడుతూ -``కథానాయిక నివేదను ఇంటర్వ్యూ చూసి ఎంపిక చేసుకున్నా.మొదట నిత్యమీనన్ - కీర్తి సురేష్ అనుకున్నాం. కానీ నివేద నటించిన మలయాళ చిత్రం `మణిరత్నం` చూసి ఓకే చేశా. `పాపనాశం` సినిమాలో కమల్ కూతురిగా నివేద నటించింది. ఆ చిత్రానికి సంబంధించి తమిళంలో తన ఇంటర్వ్యూ చూసి ఓకే చేశా. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ - మాట్లాడే విధానం నచ్చాయి. అందుకే తననే హీరోయిన్ గా ఫైనల్ చేశా. ఈరోజు నివేద - నాని పెర్ఫార్మన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది`` అన్నారు. అలా జెంటిల్ మాన్ సక్సెస్ కి నివేదా థామస్ ఎంపిక అయ్యిందంట.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మొదట నేనే ఈ కథను చాలా మందికి క్యాజువల్ గా చెప్పా. ఎందుకంటే.. నాని రెండు సినిమాలతో బిజీగా వున్నాడు. గ్యాప్ చాలా వుంటంతో.. నాని సూచన మేరకు ఆల్టర్ నేటర్ కోసం చూశా. అయితే వారెవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. చివరకు నానితో ఈ చిత్రాన్ని చేయడానికి ఫిక్సయ్యా‘ అన్నారు. షేక్ స్పియర్ నాటకాలు నాకు ఇష్టం. అందులో కొన్ని అంశాలు తీసుకుని ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాను తీయాలనుకుంటున్నా. అలాగే కొడవకంటి కుటుంబరావుది ఓ కథ.. బుచ్చిబాబు రాసిన చివరకు మిగిలేది ఈ రెండు రైట్స్ తీసుకున్నా. వాటి ఆదారంగా సినిమాలు తీయబోతున్నా’ అన్నారు.