ఒకప్పుడు హీరోలు హీరోయిన్స్ కు ఇన్ కమ్ సోర్స్ కేవలం సినిమాల ద్వారా వచ్చే పారితోషికం మాత్రమే. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. సెలబ్రెటీలకు ఇన్ కమ్ సోర్స్ చాలా విధాలుగా ఉంది. సినిమాతో వచ్చే మొత్తం కంటే సైడ్ ఇన్ కమ్ ఎక్కువగా ఉంటుంది. యాడ్స్ లో నటించడం మొదలుకుని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టే వరకు స్టార్ డమ్ ఆధారంగా ఆదాయం వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ను కలిగి ఉంటే వారి అకౌంట్స్ లో పెయిడ్ పోస్ట్ లు పెట్టుకోవచ్చు. అందుకు గాను ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా పారితోషికం ఉంటుంది. ఇండియన్ సెలబ్రెటీల్లో అత్యధిక ఇన్ స్టా పోస్ట్ పారితోషికం తీసుకుంటున్న స్టార్ గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నిలిచింది. ఆమెకు దాదాపుగా 69 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. నెట్టింట ఆమెకు ఉన్న ఫాలోవర్స్ నేపథ్యంలో ఒక్కో ఇన్ స్టా పోస్ట్ కు గాను ఏకంగా రూ.1.8 కోట్ల రూపాయలను అందుకుంటూ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న ఈ అమ్మడి సోషల్ మీడియా పోస్ట్ కు అత్యధిక రీచ్ ఉంటుంది. అందుకే కోట్ల రూపాయలను ఆమె సంపాదించుకుంటూ ఉంది.
ప్రియాంక చోప్రా మాత్రమే కాకుండా బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ హీరోయిన్స్ మరియు హీరోలు కూడా కోట్లలో ఇన్ స్టా పోస్ట్ లకు పారితోషికం తీసుకుంటున్నారు. హాట్ క్యూటీ ఆలియాకు ఇన్ స్టా లో 55 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో ఆమె ఒక్కో ఇన్ స్టా పోస్ట్ కు గాను కోటి రూపాయలను వసూళ్లు చేసింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ ఫాలోవర్స్ సంఖ్య కాస్త తక్కువే ఉన్నా కూడా ఆయనకు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో కోటి వరకు ఒక్కో పోస్ట్ కు తీసుకుంటున్నాడు. 28 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న బిగ్ బి కూడా భారీ మొత్తంలోనే ఇన్ స్టా పోస్ట్ కు పారితోషికంను అందుకుంటున్నాడు. ఆయన 55 నుండి 60 లక్షల వరకు పారితోషికంను తీసుకుంటూ ఉంటాడని టాక్ వినిపిస్తుంది. ఇక అనుష్క శర్మ 52 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉండటంతో ఆమె ఒక్కో ఇన్ స్టా పోస్ట్ కు గాను కాస్త అటు ఇటుగా కోటి వరకు తీసుకుంటుంది.
విరాట్ కోహ్లీ కూడా తన క్రేజ్ కు తగ్గట్లుగా కోటిన్నరకు పైగానే ఒక్కో ఇన్ స్టా పోస్ట్ కు చార్జ్ చేస్తాడట. రణవీర్ సింగ్ కు ఇన్ స్టా లో 36 మిలియన్ ల ఫాలోవర్స్ ఉండగా 80 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. ఇక 60 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్న ఆయన భార్య దీపిక పదుకునే కోటికి పైగానే ఒక్కో పోస్ట్ కు తీసుకుంటూ ఉంది. సల్మాన్ ఖాన్ తన ఇన్ స్టా పోస్ట్ కు 85 లక్షల వరకు తీసుకుంటాడు. కత్రీనా కాస్త అటు ఇటుగా కోటి రూపాయలను ఇన్ స్టా పోస్ట్ కు తీసుకుంటుంది. యంగ్ బ్యూటీ శ్రద్దా కపూర్ తన ఫాలోవర్స్ భారీగా ఉన్న నేపథ్యంలో రూ.1.2 కోట్లకు పైగానే తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి బాలీవుడ్ కు చెందిన చాలా మంది స్టార్స్ 50 లక్షలకు పైగానే ఇన్ స్టా పోస్ట్ కు తీసుకుంటున్నారు. ఈ స్థాయిలో ఇన్ స్టాలో పోస్ట్ లకు తీసుకుంటున్న ఈ సెలబ్రెటీలు సినిమాల కంటే ఈ పోస్ట్ ల ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది.