నాన్న చనిపోయాడు.. అక్క పాపం అలా..

Update: 2017-07-01 08:16 GMT
బాలీవుడ్ కింగ్ ఖాన్ కు తన కుటంబం అంటే పిచ్చి ప్రేమ. మొదటి కుటంబం అతని పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్రామ్ భార్య గౌరీ ఖాన్ ఇంకా.. షారూక్ అక్క షెహనాజ్‌ లాల్‌ రుఖ్‌ ఖాన్‌. మరి రెండో కుటంబం ఏంటో మీకు చెప్పవలిసిన పని లేదు అదే ‘మన సినిమా’. షారూక్ కు అన్నీ ఉన్నా అతన్ని ఎప్పుడూ భాద పెట్టే విషయం ఒకటి ఉంది అది ఏంటి అంటే ప్రపంచం మొత్తం స్టార్ గా సూపర్ స్టార్ గా కొలుస్తుంటే అది చూసి గర్వపడటానికి అతని తండ్రి లేడు, తల్లి లేదు ఉన్న అక్కకు ఇదేం పట్టదు.

షారుక్‌ తండ్రి మీర్‌ తాజ్‌ మహమ్మద్‌ 1981లో క్యాన్సర్‌ తో చనిపోయారు. అప్పుడు షారూక్ అక్క దగ్గరలో లేదు. లండన్ లో ఉంటున్న ఆమెకు ఈ వార్త తెలిసి వెంటనే ఇండియాకు వచ్చి అక్కడ జీవం లేని తండ్రిని అలా చూసేపాటికి ఆమె మెదుడు స్థంభించింది. అలా ఆగిన మెదడు పనితనం మళ్ళీ తేరుకోవడానికి కొన్నేళ్ళు పట్టిందినే చెప్పాలి. షారూక్ ఖాన్ దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలో ‘తుజే దేఖా తో..’పాట చిత్రీకరిస్తున్నప్పుడు షెహనాజ్‌ షూటింగ్‌ దగ్గర్లోని హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్నారట. అప్పటి నుండి షారూక్ తన అక్క షెహనాజ్‌ ను కంటిలో కునుపాపల కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్యేనే ఒక పని మీద బయటకు వచ్చారు ఈమె. ఆమె ను చూసి చాలాకాలం అయేపాటికి ఈమె షారూక్ ఖాన్ అక్కనా అనే అంతగా ఈ 58 ఏళ్ళ లేడీ అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.

షారుక్‌ ఉంటున్న ‘మన్నత్‌’ నివాసంలోనే ఆమె కూడా ఉంటున్నారు. అయితే ఇంట్లో అందరితో కలిసి ఉంటున్నారన్న మాటే కానీ ఇప్పటికీ తండ్రి మరణాన్ని తలుచుకొని తన గదిలో ఒంటరిగా గడుపుతుంటారట. ఎప్పుడైనా పని ఉంటే తప్పితే బయటకు రారట. అయ్యో పాపం అనిపిస్తుంది కదూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News