నయన్ - విఘ్నేష్ సినిమాకి అంత‌ర్జాతీయ‌ అవార్డ్

Update: 2021-08-09 09:30 GMT
న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్ జంట ప్రేమాయ‌ణం నిరంత‌రం అభిమానుల్లో హాట్ టాపిక్. ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు పాజిటివ్ వేలో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. అలాగే రౌడీ పిక్చర్స్ పతాకంపై సినిమాల్ని నిర్మిస్తున్నారు. నయనతార - విఘ్నేష్ శివన్ సమర్పణ‌లో ఈ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిన త‌మిళ క‌ల్ట్ చిత్రం `కూజంగల్` (గులకరాళ్లు) అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ -రోటర్ డామ్ లో పుర‌స్కారాన్ని గెలుచుకుంది.

ఈ సంద‌ర్భంగా ఆ ఆనంద క్ష‌ణాన్ని #విక్కీన‌య‌న్ హ్యాష్ ట్యాగ్ తో పంచుకుంది ఈ జంట. విగ్నేష్ శివన్ త‌న ప్రేయ‌సి నయనతారతో ఆ ఆనంద క్ష‌ణాల్ని పంచుకుంటున్న కొన్ని ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ``మా మొదటి అంతర్జాతీయ అవార్డుతో మేము.. మా ఫస్ట్ ఫిల్మ్ #గులకరాళ్లు (కూజంగల్).. మాకు ప్రతిష్టాత్మకమైన టైగర్ అవార్డ్ ని రోటర్ డామ్ నుండి చెన్నై ఇంటి వ‌ర‌కూ తీసుకువచ్చింది. మేము మా హృదయానికి దగ్గరగా చేసిన ప‌నికి ద‌క్కిన గౌర‌వ‌మిది.. ధన్యవాదాలు..  ఈ చిత్రానికి ద‌క్కుతున్న‌ ప్రశంసలు ప్రోత్సాహంతో మాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది! కృతజ్ఞతగా ఈ ఫోటోని మీ అందరితో పంచుకుంటున్నాము. అంతేకాదు.. మా దర్శకుడు రొమేనియాలో తన తదుపరి అవార్డును అందుకుంటున్నారు`` అని విఘ్నేష్ తెలిపారు.

నయనతార - విఘ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ సమర్పించిన `కూజంగల్` (గుల‌క‌రాళ్లు) మద్యానికి బానిసైన తండ్రి గణపతి అతని కుమారుడు వేలు ఇంటి నుండి వెళ్లిపోయిన ఇల్లాలి(వేలు త‌ల్లి)ని తిరిగి తీసుకురావడానికి వెళ‌తారు. మునుపెన్నడూ లేనివిధంగా గ్రామీణ జీవితంలోని విశాలతను కఠినమైన కళాత్మక పద్ధతిలో తెర‌పై ఆవిష్క‌రించిన తమిళ చిత్రాలలో కూజంగల్ ఒకటి. ఈ చిత్రం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్ డామ్ లో ప్రపంచ ప్రీమియర్ ని ప్ర‌ద‌ర్శించారు. వేడుక‌ల్లో ప్రతిష్టాత్మక టైగర్ అవార్డును గెలుచుకుంది. సౌత్ లో ఇలాంటి మ‌రెన్నో సినిమాలు తెర‌కెక్కుతున్నా పుర‌స్కారాల వ‌ర‌కూ వెళుతున్న‌ది త‌క్కువే. వెళ్లినా అవార్డు ద‌క్కాలంటే చాలా పోటీని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. న‌య‌న‌తార క‌థానాయికగా విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన కాతువాకుల‌ రెండు కాద‌ల్ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఇందులో స‌మంత ఒక నాయిక‌గా న‌టించగా విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడి పాత్ర‌ను పోషించారు.
Tags:    

Similar News