సుశాంత్ కి నివాళులు అర్పించిన 'ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీ'.. అసలు నిజాలు వెల్లడి!

Update: 2020-06-17 17:30 GMT
యంగ్ హీరో సుశాంత్ గురించి ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్శిటీ స్పందించిందా.. అంటే నిజమే. స్పందించి సుశాంత్ కి సంతాపం కూడా వ్యక్తం చేసింది. అసలు బాలీవుడ్ నటుడికి ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీ(ఐఎస్‌యు)కి ఏం సంబంధం అని విషయం తెలిసిన ప్రతీ ఒక్కరిలో ఈ అనుమానం మొదలవుతుంది. ఐఎస్‌యు అనేది అంతరిక్షంలో పరిశోధనలపై విస్తృతంగా పని చేసే సంస్థ. ఆ సంస్థ బాలీవుడ్ సినీహీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య గురించి సంతాపం తెలుపుతూ ఒక నోట్ విడుదల చేసింది. ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్ యూనివర్సిటీ.. ఇక్కడే ఇండియాలో సినిమాలు చేసుకునే సుశాంత్ కి నివాళి ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అలాంటి ఇంటర్నేషనల్ సంస్థ స్పందించింది అంటే ఏదో బలమైన కారణం ఉంటుంది కదా.. హీరో సుశాంత్‌కు సైన్స్ మీద విపరీతమైన ఆసక్తి. ముఖ్యంగా అంతరిక్షానికి సంబంధించిన విషయాలంటే అతనికి ఎంతో ఆసక్తి. సుశాంత్ తన సోషల్ మీడియా ఖాతాలలో అంతరిక్షానికి సంబంధించిన పోస్టులు పెట్టేవాడు. సుశాంత్ సైన్స్ మీద ఎంత ఇంటరెస్ట్ చూపేవాడో తను పెట్టే పోస్టులు చూస్తే అర్ధమవుతుంది. అసలు విషయం ఏంటంటే.. సుశాంత్ అంతరిక్షంలో కూడా స్థలం కొన్నాడు. గోప్యంగా ఉన్నాసరే ఇదే నిజం.. సుశాంత్ మాత్రమే ఇండియన్ సినీ యాక్టర్లలో అంతరిక్షంలో స్థలం కలిగిన ఏకైక సినీ సెలబ్రిటీ. సుశాంత్ జీవితంలో సాధించాలని అనుకున్న యాభై కలల్లో అంతరిక్ష యానం కూడా ఒకటి.

సుశాంత్ అందుకే ‘ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్శిటీ’తో టచ్ లో ఉండేవాడట. ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న పరిశోధనల గురించి తెలుసుకునేవాడని స్పేస్ యూనివర్సిటీ నోట్ లో తెలిపింది. మరో విషయం.. సుశాంత్ స్పేస్ నేపథ్యంలో ఒక భారీ సినిమా కూడా చేయాలనుకోవడం.. ఇందుకోసం ఆస్ట్రోనాట్ అవతారంలోకి మారి అంతరిక్ష యానం చేసిన శాస్త్రవేత్తలతో కలిసి కొంత శిక్షణ కూడా తీసుకున్నాడట. 2017లో ఆ సినిమాకోసం ఎంతో సీరియస్ గా పనిచేసి తానే మరో సంస్థతో కలిసి నిర్మించాలని అనుకున్నాడట. కానీ దురదృష్ట వశాత్తు ఆ ప్రాజెక్ట్ అలాగే మిగిలిపోయింది. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఇంత త్వరగా వదిలివెళ్లడం బాధాకరమే.
Tags:    

Similar News