జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకోవడం అన్నది కొద్దిమందికే సాధ్య ం. ఈ కేటగిరీలో వింక్ సెన్సేషన్ ప్రియాప్రకాష్ వారియర్ పేరు చేరింది. నటించిన తొలి సినిమా `ఒరు ఆడార్ లవ్` (లవర్స్ డే) అన్ని చోట్లా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కన్నుగీటుడు ఎపిసోడ్ తప్ప ఇంకేదీ లేదని.. సరైన క్లైమాక్స్ లేదని క్రిటిక్స్ పెదవి విరిచేశారు. అయితే ఒకటో సినిమా సెట్స్ లో ఉండగానే ఈ అమ్మడు వరుసగా పలు ఆఫర్లు అందుకుంది. అందులో `శ్రీదేవి బంగ్లా` అనే బాలీవుడ్ సినిమా కూడా ఉంది.
ఒకే ఒక్క వింక్ వీడియోతో జాతీయ - అంతర్జాతీయ స్థాయి లో పాపులారిటీ దక్కించుకున్న ప్రియాకు అన్ని పరిశ్రమల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ వాటి నుంచి సెలక్టివ్ గానే ఎంపిక చేసుకుంది. అసలు తొలి సినిమా జయాపజయాలతో పనే లేకుండా దర్శకనిర్మాతలు ప్రియాకు అవకాశాలివ్వడం ప్రస్తుతం చర్చకొస్తోంది. ఇప్పటికే శ్రీదేవి బంగ్లా టీజర్ తోనే పలు వివాదాల్ని మోసుకొచ్చిన సంగతి తెలిసిందే. శ్రీదేవి బాత్ టబ్ లో పడి దుర్మరణం పాలైన విషయాన్ని ఫిక్షనల్ గా అదో మర్డర్ మిస్టరీగా చిత్రీకరిస్తున్నారని ఇప్పటికే బోనీ కపూర్ కోర్టు లో కేసు వేసిన సంగతి తెలిసిందే. వివాదాలు.. సెన్సేషన్స్ ప్రియా ఇమేజ్ ని పెంచుతున్నాయే కానీ తగ్గించడం లేదు. అందుకే ఈ అమ్మడి ఖతాలో ఇంకో క్రేజీ సినిమా పడింది. అది కూడా నేషనల్ లెవల్లో చర్చకు వచ్చే బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
శ్రీదేవి బంగ్లా ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమాకు సైన్ చేయడం ప్రస్తుతం చర్చకు వచ్చింది. `లవ్ హ్యాకర్స్` అనేది ఈ మూవీ టైటిల్. మయాంక్ ప్రకాష్ శ్రీవాస్తవ దర్శకత్వం వహిస్తున్నారు. సైబర్ క్రైమ్స్ నేపథ్య ంలో ఆద్య ంతం రక్తి కట్టించే థ్రిల్లర్ సినిమా ఇది. మే చివర్లో సెట్స్ కి వెళతారట. లక్నో, ఢిల్లీ, గుర్గావ్, ముంబైలో షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి ప్రియా వారియర్ మాట్లాడుతూ... ఉత్క ంఠ రేకెత్తించే పాత్రలో నటిస్తున్నానని.. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కథ సాగుతుందని వెల్లడించారు. ఓవైపు సినిమాలతో పాటు మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ జోరుగా ఉండే ప్రియా ప్రకాష్ పలు కార్పొరెట్ ఉత్పత్తుల ప్రచారం కోసం భారీ కాంట్రాక్టులు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.