ఆ ప్లేసులో హాట్ ఐపిఎల్ యాంకర్

Update: 2017-11-01 18:09 GMT
ఏ స్థాయిల్ నమ్మకం పెట్టుకున్నారో గాని నాలుగు బాషాల వారు ఒకేసారి హిందీ క్విన్ రీమేక్ ని ఎవరి భాషలకు తగ్గట్టు వారు తెరకెక్కిస్తున్నారు. హిందీలో కంగనా రనౌత్ నటించిన ఆ సినిమా వందకోట్లు రాబట్టిందని అదే నమ్మకంతో సౌత్ సినీ జనాలపై ప్రయోగాన్ని చేయబోతున్నారు. తెలుగులో తమన్నా లీడ్ రోల్ లో నటిస్తోంది. అయితే సినిమా మొదలైన తొలి షెడ్యూల్ కే నాలుగు బాషాల చిత్ర యూనిట్ కి షాక్ తగిలింది.

హిందీ క్వీన్ సినిమాలో ఫ్రెండ్ రోల్ చేసిన లిసా హేడెన్ పాత్రకు ఎవరిని ఎంచుకోవాలని గత కొంతకాలంగా ఆలోచించిన చిత్రల యూనిట్. అన్ని భాషలకు కలిపి అమీ జాక్సన్ ను ఎంచుకున్నారు. కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నారని అలాగే క్రియేటివ్ డిఫరెన్స్ తో చేయనని చెప్పిందని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా నో చెప్పిందనే వార్త నిజమైంది. దీంతో నిర్మాతలు ఐపీఎల్ హాట్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శిబాని దండేకర్ తో లిసా పాత్రను చేయడానికి సిద్దం చేస్తున్నారు.

ఈమెను కేవలం తెలుగు - మలయాళం వెర్షన్ లకి మాత్రమే సెలెక్ట్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ఇక కన్నడ - తమిళ్ రీమేక్ లో ఎల్లి ఎవ్రామ్ అనే డ్యాన్సర్ కమ్ నటిని ఎంచుకున్నారట. మరి ఈ భామలు ఎంతవరకు ఆ వెరైటీ పాత్రకి న్యాయం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News