ఇది మ‌రో చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడులా ఉందిగా

Update: 2020-10-07 15:34 GMT
వెండితెర‌పై బూతు స‌న్నివేశాలపై సాంప్ర‌దాయ వాదుల నుంచి నిరంత‌రం విమ‌ర్శ‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. మోడ్ర‌న్ జ‌న‌రేష‌న్ కి త‌గ్గ‌ట్టు సినిమా తీస్తున్నాం అని చెబుతూ విచ్చ‌ల‌విడి విశృంఖ‌లత్వాన్ని తెర నిండుగా చుట్టేస్తున్నారు కొంద‌రు ఫిలిం మేక‌ర్స్. సినిమా అంటే మీనింగ్ మార్చేశారు. ఇటీవ‌లి కాలంలో ఏ సెక్ష‌న్ వాళ్ల కోస‌మే సినిమా తీస్తున్నాం అంటూ ఒక సెక్ష‌న్ నిర్మాత‌లు హ‌ద్దుమీరిన బూతు స‌న్నివేశాల‌తో సినిమాలు తీస్తున్నారు.

2 నిమిషాల టీజ‌ర్ లో నాలుగైదు పెద‌వి ముద్దు స‌న్నివేశాలు.. ఘాటైన రొమాన్స్ దృశ్యాలు.. అంత‌కుమించి బెడ్ రూమ్ ఎపిసోడ్ల‌తో ర‌క్తి క‌ట్టించేస్తున్నారు. ఇక ఇందులో హార‌ర్ టెర్ర‌ర్ పేరుతో దెయ్యం సీన్లు తీసి ఆడియెన్ కి చెవిలో పువ్వు పెట్టేస్తున్నారు. ఇంత‌కుముందు చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు అంటూ ఈ త‌ర‌హా రొమాంటిక్ కామెడీని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. రియాలిటీ షో త‌ర‌హా కాన్సెప్ట్ ఒక సెక్ష‌న్ ఆడియెన్ కి నచ్చితే క్రిటిక్స్ మాత్రం య‌థావిథిగా విమ‌ర్శించారు. ఇక విమ‌ర్శ‌ల‌ ప‌ని లేకుండా ఆ సినిమా డ‌బ్బు తెచ్చింద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

చూస్తుంటే ఇప్పుడు అదే త‌ర‌హా కాన్సెప్టుతో త‌మిళంలో మ‌రో సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం `ఇరుట్టు అరాయిల్ మురట్టు కుత్తు` కి సీక్వెల్. ఇరంద‌మ్ కుత్తు అనేది టైటిల్. ఇందులో యషిక ఆనంద్ - గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. హీరో ఆర్య ఇప్పుడు ఈ చిత్రం రెండవ లుక్ ని అలాగే టీజర్ ను విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం అడ‌ల్ట్ కామెడీ తో చుట్టేశారు. ఎ రేటెడ్ దృశ్యాలు ఉన్నాయి. సంతోష్ పి జయకుమార్ - డేనియల్ అన్నీ పోప్- అకృతి సింగ్ - కరిష్మా కౌల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజేంద్రన్ - చామ్స్ ఈ చిత్రంలో ఇత‌ర కీల‌క‌ పాత్రలు పోషిస్తున్నారు. ‘ఈ తరంలో స్టైలిష్ ఎంగేజింగ్ మూవీ.. ఈ త‌ర‌హా ఎంటర్ టైన్మెంట్ ఫిల్మ్ తీయ‌డం చాలా కష్టం.

ఇంత‌కుముందు ప్రీక్వెల్ రిలీజ్ స‌మ‌యంలో కొన్ని సన్నివేశాలు బూతు కామెడీ వివాదాలను సృష్టించింది. లక్ష్మీ రామకృష్ణన్ వంటి కొద్దిమంది ప్రముఖులు ఈ మూవీ విశృంఖ‌ల‌త‌ను ప్రశ్నించి దర్శకుడిని విమర్శించారు. సంతోష్ తన సినిమాను ఒక నిర్దిష్ట విభాగం ప్రేక్షకుల కోసం నిర్మించాడని ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప‌ని లేద‌ని కూడా అన్నారు. కళా ప్రక్రియను ఇష్టపడని వ్యక్తులు సినిమా చూడటానికి దూరంగా ఉండొచ్చ‌ని చెప్పారు. ఈ చిత్రానికి ధరణ్ కుమార్ సంగీతం సమకూర్చారు.
Full View
Tags:    

Similar News