రజినీపై సెటైర్ వేసి.. రజినీతోనే పోటీ

Update: 2016-07-18 15:30 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా పోస్టర్ మీద ఈ మధ్య ఓ బాలీవుడ్ హీరో సెటైర్లు గుప్పించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాను కథానాయకుడిగా నటించిన ‘మదారి’ పోస్టర్‌ ను ‘కబాలి’ మేకర్స్ కాపీ కొట్టి పోస్టర్ చేసుకున్నారని.. ఇది పద్ధతి కాదని బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ట్వీట్ చేయడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇది అఫీషియల్ పోస్టర్ కాదని.. ఎవరో అభిమానులు తయారు చేసిందాన్ని పట్టుకుని విమర్శలు గుప్పించడం సరికాదని నిర్మాత కలైపులి థాను స్వయంగా వివరణ ఇచ్చాడు. దీంతో అందరూ ఇర్ఫాన్ ను తిట్టడం మొదలుపెట్టారు. అతను తెలివిగా తాను జస్ట్ జోక్ చేశాను అంతే అంటూ మాట మార్చేశాడు. దీంతో వివాదం సద్దుమణిగింది.

ఆ సంగతలా వదిలేస్తే.. ‘కబాలి’ విడుదలవుతున్న ‘మదారి’ కూడా విడుదలువుతండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎంత హిందీ సినిమా అయినప్పటికీ.. రజినీ మూవీతో పోటీకి దిగడం సాహసమే. రజినీ సినిమాలకు ఈ మధ్య నార్త్ ఇండియాలో కూడా క్రేజ్ పెరిగింది. ఇక రజినీ సినిమా వస్తోందంటే సౌత్ ఇండియాలోని మరే భాషలోనూ సినిమాలు విడుదల చేయరు. ‘మదారి’కి అటు నార్త్ తో పాటు ఇటు సౌత్ లోనూ దెబ్బే. ఐతే రజినీ సినిమాకు తమ చిత్రానికి పోటీగా భావించడం లేదని అంటున్నాడు ఇర్ఫాన్. ‘‘కబాలి..మదారీ ఈ నెల 22న ఒకేరోజు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏ మాత్రం లేదు. రజనీ చాలా పెద్దోడు. ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. నేను ఆయనతో సమానుడిని కాను. నా సినిమాకు మంచి వసూళ్లు వస్తే సంతోషం. వ్యక్తిగా ఆయన్నెంతో గౌరవిస్తాను. ఆయనతో పోటీపడాలంటే ఇంకో జన్మ ఎత్తాలి’’ అని ఇర్ఫాన్ ఖాన్ అన్నాడు.
Tags:    

Similar News