నిజమా.. 151లో బిగ్ బి చేస్తున్నాడా?

Update: 2017-08-01 16:56 GMT
ఇప్పుడు అన్నింటికంటే పెద్ద రూమర్ ఏంటంటే.. ఒక మెగాస్టార్ సినిమాలో మరో మెగాస్టార్ చేయడమే. అయితే బాలీవుడ్ సర్కిల్స్ మాత్రం ఈ విషయంలో నానా రచ్చా చేస్తున్నాయి. ఒక్కసారిగా అక్కడ ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'' సినిమా పెద్ద టాపిక్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా సురేందర్ రెడ్డి డైరక్షన్లో రూపొందనున్న ఈ సినిమా గురించి ఇప్పుడు బాలీవుడ్ లో ఇలాంటి కథనాలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఇప్పటివరకు ఉయ్యాలవాడ లాంచ్ డేట్ ఏంటో చెప్పనేలేదు. కాకపోతే ఆగస్టు 15న కాని లేదంటే ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాని ఈ సినిమాను మొదలెడతారని ఒక టాక్ ఉంది. విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ఒక ప్రత్యేక రోల్ లో నటించడానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమా స్ర్కిప్టు తనకు పూర్తిగా చెప్పలేదని ఐశ్వర్య రాయ్ ఈ ప్రాజెక్టును తిరస్కరించగా.. తనకు ఆఫర్ చేసిన రోల్ బాగుండటంతో.. కేవలం చిరంజీవితో ఉన్న స్నేహం కారణంగా ఆ పాత్రను చేయడానికి అమితాబ్ ఒప్పుకున్నారట.

మనకు తెలిసిన విషయాల ప్రకారం.. ఐశ్వర్య రాయ్ 9 కోట్లు అడగటంతో ఆమెను ఈ పాత్రకు తీసుకోవట్లేదని.. అలాగే నయన్ విషయంలో కూడా ఇంకా రెమ్యూనరేషన్ వైజ్ ఏమీ సెటిల్ కాలేదని వినిపిస్తోంది. మరి ఏది నిజమో తెలియదు కాని.. ఆల్రెడీ తెలుగులో అప్పట్లో నాగార్జున మనం సినిమాలో చిన్న రోల్ చేసిన అమితాబ్.. బాలయ్య రైతులో రోల్ ఆఫర్ చేస్తే దానికోసం డేట్లు కేటాయించలేకపోయారు. ఇప్పుడు చిరంజీవి 151కి నిజంగా డేట్లిస్తారా? చూద్దాం. 
Tags:    

Similar News