రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ `లైగర్`. సాలా క్రాస్ బ్రీడ్ అంటూ పూరి జగన్నాథ్ హంగామా చేసిన ఈ మూవీ ఆగస్టు 25న గురువారం భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ మూవీ లైగర్ ఫ్యాన్స్ ని ఏ విషయంలోనూ సంతృప్తి పరచలేకపోయింది. కరణ్ జోహార్ వన్ ఆఫ్ ద నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే పరిచయం అయింది.
కేవలం తనని కరణ్ జోహార్ ఒత్తిడి వల్లే `లైగర్` టీమ్ పెట్టుకున్నట్టుగా స్పష్టమవుతోంది. తన ప్లేస్ లో కియారా అద్వానీని పెట్టినా, ముందు అనుకున్న జాన్వీ కపూర్‌ని పెట్టిన సినిమాకు కొంత వరకు ప్లస్ అయ్యేదేమో. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ యునానిమస్ గా అంటున్న మాట ఇది. `అఫాట్ .. అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ లో తప్ప అనన్య పాండే మరే పాటలోనూ... సినిమాపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
సినిమాలో హీరో హీరోయిన్ ల మధ్య పూరి నడిపిన బీసీ కాలం నాటి ప్రేమకథ మరీ బోరు కొట్టించేస్తే అనన్య చాలు బాబబోయ్ ఆమె మాటి మాటికి స్క్నీన్ మీదికి రావొద్దని చెప్పండయ్యా.. అని సగటు ప్రేక్షకుడు అనన్య కనిపించిన ప్రతీ సారి అసహనాన్ని ఫీలయ్యేలా చేసిందంటే పూరి ఆమె పాత్రని ఏ స్థాయిలో మలిచాడో అర్థం చేసుకోవచ్చు. సినిమా ట్రాక్ లోకి వస్తుందన్న ప్రతీ సారి అనన్య ఎంట్రీతో సైడ్ ట్రాక్ పట్టేసి ప్రేక్షకుడికి విసుగు తెప్పించిందని చెబుతున్నారు.
ఇక సినిమాలో పూరి అనన్య, విజయ్ ల మధ్య నడిపించిన లవ్ స్టోరీ కూడా ప్రేక్షకుడికి విసుగు తెప్పించేలా వుందట. అదే అనన్య పాలిట శాపంగా మారిందని, ఏ సీన్ బలంగా లేకపోవడంతో పెద్దగా రాణించలేకపోయిందని, తన ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ కూడా ప్రధాన సమస్యగా మారాయని చెబుతున్నారు.
కొంత మందైతే సినిమాకు అనన్య ప్రధాన మైనస్ అని తేల్చేస్తున్నారు. తనని టాలీవుడ్ భరించడం కష్టం అంటున్నారు. బాలీవుడ్ మార్కెట్ కోసం తీసుకుంటే ఆ మార్క్ అనన్య ఎక్కడా చూపించలేదని కూడా కామెంట్ లు వినిపిస్తున్నాయి.