ప్రస్తుతం ఏ నోట విన్నా `అవెంజర్స్: ఎండ్ గేమ్` మానియా గురించే. నేడు(శుక్రవారం) ఈ సినిమా అమెరికా- ఇండియా- చైనా సహా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో రిలీజైంది. తొలి వారాంతానికే ఈ చిత్రం బిలియన్ డాలర్ క్లబ్ లో అంటే 6900 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇండియా నుంచి 500 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేసారు. అన్ని మెట్రో నగరాల్లో థియేటర్లు బ్లాక్ అయిపోయాయి. హైదరాబాద్ లోనూ ఇదే పరిస్థితి. భారతదేశంలో ప్రీబుకింగ్ టిక్కెట్ సేల్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అంతేకాదు ఈ సినిమా `బాహుబలి -2` ప్రీ టికెట్ బుకింగ్ రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషించింది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. `బాహుబలి -2` అడ్వాన్స్ టికెట్ బుకింగ్ రికార్డులు చెక్కు చెదరకుండా పదిలంగానే ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది రిలీజైన `అవెంజర్స్- ఇన్ ఫినిటీ వార్` ఇండియా లో `బాహుబలి 2` అడ్వాన్స్ టిక్కెట్స్ రికార్డును బ్రేక్ చేయడంలో విఫలమైంది. ఇన్ ఫినిటీ వార్ 20 లక్షల (2 మిలియన్) టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఈ సిరీస్ చివరి సినిమా `అవెంజర్స్ - ఎండ్ గేమ్` 25 లక్షల (2.5 మిలియన్) టిక్కెట్లకు అటూ ఇటూగా అమ్మకాలు సాగించారని అంచనా వేస్తున్నారు. బాహుబలి 2 రికార్డుకు దరిదాపుల్లో ఈ సినిమా లేదని దీనిని బట్టి అర్థమవుతోంది.
బాహుబలి 2 అడ్వాన్స్ టిక్కెట్ సేల్ లో బాహుబలి 2 ఇండియాలోనే నంబర్ -1 స్థానంలో ఉంది. ఈ వారియర్ కాన్సెప్ట్ సినిమా 33 లక్షల (3.3 మిలియన్) టిక్కెట్ల అమ్మకం సాగించింది. `అవెంజర్స్ - ఎండ్ గేమ్` ఈ రికార్డును బ్రేక్ చేస్తుందని అంచనా వేసినా అది సాధ్యపడలేదు. ఇక బాహుబలి 2 చిత్రం భారతదేశంలో 156 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే సుమారు 800కోట్లు పై మాటే. ఆ రికార్డును `ఎండ్ గేమ్` బ్రేక్ చేసే ఛాన్సే లేదని భావిస్తున్నారు.