#సీక్వెల్ ఎందుకీ రొడ్డ‌కొట్టుడు స్టంటు?

Update: 2020-02-20 08:30 GMT
సినిమా ఇంకా రిలీజ్ కానే లేదు. అప్పుడే సీక్వెల్ అట‌! మ్ మ్ మ్... ఇది నిజ‌మా? మ‌రీ ఇంత గొప్ప‌ జోకేంటి? పిచ్చి పీక్స్ ప‌బ్లిసిటీలో ఇదోర‌కం అనుకోవాలేమో! గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ సినిమాల‌ ప్ర‌చారస‌ర‌ళి గ‌మ‌నిస్తే.. మ‌రీ ప‌రాకాష్ట‌లోనే సాగుతోంది. ఇంకా సెట్స్ పై ఉండ‌గానే బిజినెస్ అయి పోయింద‌ని .. అప్పుడే సీక్వెల్ ప్లాన్ చేసేస్తున్నార‌ని ఊక‌దంచేస్తున్నారు. ఇక రిలీజ్ ముందు ప్ర‌చారార్భాటం అయితే అంతా ఇంతా కాదు. ఎవ‌రికి వారు ఈ సినిమా సూప‌ర్ హిట్టు అని .. సీక్వెల్ స్క్రిప్టు రెడీ అయి పోతోంద‌ని ఊద‌ర‌ గొట్టేస్తున్నారు.

ఇంకా సీఎంగా గెల‌వ‌క ముందే సింహాస‌నం త‌యారు చేయించుకున్న‌ట్టు.. ఈ ప‌బ్లిసిటీ బాగానే ఉంది కానీ దానిని న‌మ్మేది ఎంద‌రు? అంటే సందేహ‌మే. అస‌లే జ‌నం అప్ డేటెడ్ గా ఉంటున్నారు. ఆవులిస్తే పేగులు లెక్కిస్తున్నారు. సోష‌ల్ మీడియా - డిజిట‌ల్ యుగంలో ప్ర‌తిదీ ఓపెన్ గా తెలిసిపోతోంది. దాచేందుకు ఏదీ లేదు. ఈ శుక్ర‌వారం రిలీజ్ కి రెడీ అవుతున్న భీష్మ విష‌యం లో ప్ర‌చారం చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌ మాన‌దు.

అప్పుడే భీష్మ‌కు సీక్వెల్ అంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తున్నారు. 2021లో సేమ్ టీమ్ ఈ సీక్వెల్ చిత్రీక‌ర‌ణ‌ కు రెడీ అయిపోతోంద‌ని.. స్క్రిప్టు ప‌నులు ఆల్రెడీ మొద‌లెట్టేశార‌ని అబ్బో ఒక‌టే ప్ర‌చారం సాగిపోతోంది. నితిన్ - వెంకీ కుడుముల‌- ర‌ష్మిక మంద‌న‌.. సేమ్ టీమ్ సీక్వెల్ కి కూడా రెడీ అయిపోయింది అంటూ క‌ల‌రింగ్ ఇచ్చేయ‌డం చూస్తుంటే ప్ర‌చారార్భాటం మ‌రీ ఇంత టూమ‌చ్ గానా? అనిపించ‌క మాన‌దు. ప్ర‌మోష‌న్స్ లో సీక్వెల్ అనే వ‌ర్డ్ చాలా కామ‌న్ అయిపోయింది. కేవ‌లం భీష్మ వ‌ర‌కే కాదు. అల వైకుంఠ‌పుర‌ములో సీక్వెల్.. ఇస్మార్ట్ శంక‌ర్ సీక్వెల్.. ఇంకా ఎన్నో సినిమాల సీక్వెల్స్ గురించి ఇలానే ప్ర‌చార‌మైపోయింది. అయితే ఇందులో ఏదైనా మొద‌ల‌య్యాకే సెట్స్ కెళుతున్న‌ట్టు! లేదంటే అధికారికంగా అయినా ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంటుంది.
Tags:    

Similar News