టాలీవుడ్ ట్రెండ్ బాలీవుడ్ కి పాకిందే!

Update: 2022-11-02 09:30 GMT
టాలీవుడ్ లో రీ-రిలీజ్ లు ఇప్పుడు డ్రెండ్ గా మారాయి. ఓల్డ్  హిట్ చిత్రాల్ని డాల్మి అట్మాస్ ఫార్మెట్ లో రిలీజ్  చేసి స‌క్సెస్ అందుకుంటున్నారు. స్టార్ హీరోల బ‌ర్త్ డేల స్సెష‌ల్ గా రిలీజ్ అవుతోన్న రీ-రిలీజ్ ల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర్థం ప‌డుతున్నారు. ప‌రిమితి థియేట‌ర్ల‌ల‌లోనే రిలీజ్ అవ్వ‌డంతో  బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు బాగుంటున్నాయి.

ఆ మ‌ధ్య రిలీజ్ అయిన చిరంజీవి..ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..ప్ర‌భాస్ సినిమాలు చ‌క్క‌ని వ‌సూళ్ల‌ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక‌పై ఇదే విధానం మిగ‌తా హీరోల విష‌యంలో కొన‌సాగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ విజువ‌ల్ వండ‌ర్  'అవ‌తార్-2' రిలీజ్  కి ముందు 'అవ‌తార్' ని మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే.

'అవ‌తార్-2' బెస్ట్ ఎక్స్ పీరియ‌న్స్ పొందాలంటే ముందు అవ‌తార్ ని ఓ సారి వీక్షిస్తే బాగుటుంది! అన్న ఉధ్దేశంతో న్యూ టెక్నాల‌జీతో మ‌రోసారి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇలా రీరిలీజ్ ల‌ వెనుక బిజినెస్ స్ర్టాట‌జీ ఉంద‌ని తెలుస్తోంది.

తాజాగా బాలీవుడ్ లోనూ ఈ ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.  షారుక్ ఖాన్..కాజోల్ జంట‌గా న‌టించిన సంచ‌లన 'దిల్ వాలే  దుల్హ‌నియా లేజాయేంగే' చిత్రాన్ని మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.

షారుక్ ఖాన్ 57వ పుట్టిన రోజు సంద‌ర్భంగా  చిత్రాన్ని మ‌ళ్లీ రిలీజ్ చేస్తున్నట్లు య‌శ్ రాజ్ ఫిలింస్ ప్ర‌క‌టించింది.  బుధ‌వారం నుంచి పీవీఆర్..సినీ పోలీక్స్..ఐనాక్స్ లో ప్ర‌ద‌ర్శిస్తున్న్లు తెలిపారు. ఇక సినిమా 1995 లో ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసిందో చెప్పాల్సిన ప‌నిలేదు. షారుక్ కాజోల్ కెరీర్ లోనే ఓ మైల్ స్టోనీ మూవీగా నిలిచింది.

అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్ మూవీగా ఖ్యాతికెక్కింది.  బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్ర‌మిది . ఈ విజ‌యంతో షారుక్-కాజోల్ రొమాంటిక్ జోడీగా పేరు సంపాదించారు. అలాంటి సినిమా మ‌ళ్లీ రిలీజ్ అయితే  మోత త‌ప్ప‌ద‌నే చెప్పాలి. ఇదే త‌ర‌హాలో మిగ‌తా స్టార్ హీరోల చిత్రాలు పుట్టిన రోజు సందర్భంగా రీ-రిలీజ్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంది. అమీర్ ఖాన్...హృతిక్ రోష‌న్ లాంటి స్టార్ హీరోల ఓల్డ్ క్లాసిక్ హిట్స్ మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకొస్తే విధ్వంస‌మే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News