కాస్ట్ కంట్రోల్ అన్నది పరిశ్రమలో నిరంతరం హాట్ టాపిక్. అదుపు తప్పి పెట్టే పెట్టుబడి వల్ల లాభం ఉండదు. హీరో మార్కెట్ .. సినిమా స్పాన్ ని బట్టి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా బడ్జెట్ అదుపు తప్పితే ఆ పర్యవసానం ఎలా ఉంటుందో పలువురు దర్శకనిర్మాతలు.. హీరోలు అనుభవ పూర్వకంగా తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి సన్నివేశం నుంచి బయటపడేందుకు నితిన్ భీష్మ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోందట. వివరాల్లోకి వెళితే...
కొంత గ్యాప్ తర్వాత నితిన్ వరుస సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం `ఛలో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో `భీష్మ` సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయిక. ఇదివరకూ నితిన్ చేతికి గాయం అవ్వడంతో కొన్ని నెలల పాటు షూటింగ్ ఆలస్యమైంది. అతడు కోలుకున్న అనంతరం ఇటీవలే షూటింగ్ ని రీస్టార్ట్ చేశారు. కారణం ఏదైనా ఈ ఆలస్యం నితిన్ టీమ్ ని కలవరపెడుతున్నట్టే కనిపిస్తోంది.
ఇప్పటికే ఫిబ్రవరి 3వ వారంలో సినిమాని రిలీజ్ చేసేందుకు డెడ్ లైన్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ మేరకు ఇన్ టైమ్ లో పూర్తి చేయాలని వెంకీ కుడుముల ఈ సినిమాని చాలా స్పీడ్ గా కానిచ్చేస్తున్నాడట. ఇటీవల తూ.గో జిల్లా అన్నవరం పరిసరాల్లో షెడ్యూల్ ని పూర్తి చేశారు. అయితే అక్కడ చాలా సీన్లు కట్ షాట్ తరహాలో చిత్రీకరించారని చెబుతున్నారు. అయితే ఇలా ఎందుకు చేశారు? బడ్జెట్ పెరిగిపోతోందనే భయంతోనే ఇలా చేశారా? కంట్రోల్ నియమం పాటిస్తున్నారా? లేక ఆ కట్ షాట్స్ వెనక పరమార్థం ఏమిటి? అన్న ముచ్చట సాగుతోంది. దీనిపై సరైన క్లారిటీ అయితే లేదు. భీష్మ తన కెరీర్ లో ఎంతో కీలకమైన సినిమా అని నితిన్ చెబుతున్నారు. మరి దీనిపై ఏ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అన్నది చూడాలి.