స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కుమార్తెలు ప్రియాంక దత్..స్వప్నదత్ లు నిర్మాణం రంగంలో ఎలా దూసుకుపోతున్నారో చూస్తునే ఉన్నాం. 'మహానటి' లాంటి గొప్ప చిత్రం రూపం దాల్చిందంటే దాని వెనుక ప్రధాన కారకులు దత్ పుత్రరత్నాలే. వాళ్లే పూనుకోక పోయుంటే మహానటి సావిత్రి జీవితం మరోపదేళ్లు పట్టేది. 'ప్రాజెక్ట్-కె' లాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రం వందల కోట్లు పెట్టుబడితో రూపం దాల్చుకుంటుందంటే దాని వెనుక వారసురాళ్లు ఇద్దరి శ్రమ ఎంతో ఉంది.
డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేసే గట్స్ ఉన్న లేడీ నిర్మతలు. ఇద్దరి కాంబినేషన్ లో మరెన్నో అద్భుతాలు రానున్నాయి. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రియాంక...స్వప్న్ లు ఆ తండ్రినే గర్వపడేలా చేస్తున్నారు. నేడు నిర్మాణ రంగంలో అగ్రగామిగా రాణిస్తున్నారంటే? ఆ తండ్రి కృషి ఎంతో ఉందన్నది వాస్తవం. మరి ఇదే తరహాలో దిల్ రాజు సైతం వారసుల్ని తెరపైకి తెస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది.
రాజుగారి ఒక్కగాన ఒక్క కమార్తె హర్షిత రెడ్డి. 'బలగం' సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతోంది. ఈ సందర్బంగా దిల్ రాజు భవిష్యత్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'మేం నిర్మాణ సంస్థని ప్రారంభించి కొత్త దర్శకులు..నటుల్ని పరిచయం చేసాం. నిర్మాతలుగా ఎదుగుతోన్న కొద్ది దిల్ రాజు పెద్ద సినిమాలే చేస్తారులే వంటి అభిప్రాయాలు చాలా మంది నుంచే వ్యక్తమయ్యాయి.
కొత్త తరానికి కూడా చేరువగా ఉండాలనే సంకల్పంతోనే కొత్త నిర్మాణ సంస్థని ప్రారంభించాం. మా కుటుంబంలోని మరోతరం పరిశ్రమలోకి వస్తున్నారు. ఇకపై వారే మా ఈ కొత్త సంస్థ బాధ్యతలు చెపడుతారన్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో ఈ కొత్త బ్యానర్ 'బలగం' అనే సినిమాతో లాంచ్ అయింది.ఈ చిత్రానికి కమెడీయన్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు.
మొత్తానికి రాజుగారు పెద్ద ప్లాన్ తోనే తనయని సినీ రంగంలోకి దించినట్లు కనిపిస్తుంది. చిన్న నిర్మాతగా మొదలై అగ్ర నిర్మాతగా ఎదగడానికి అవకాశం ఉంది. మహిళ కాబట్టి వేగంగానే పేరొచ్చే అవకాశం ఉంది. వెనుక తండ్రి సహకారం ఎలాగూ ఉంటుంది కాబట్టి..నిర్మాతగా తప్పటడుగులు పడటానికి అవకాశాలు తక్కువ. కళ్ల ముందు ఇద్దరు సక్సెస్ పుల్ లేడీ నిర్మాతలు స్పూర్తిగా నిలుస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.