కొన్నిసార్లు స్టార్ హీరోల నుండి కొత్తసినిమా వస్తుందంటే ఆ జోష్ వేరేలా ఉంటుంది. అందులోనూ ఫ్యాన్స్ అయితే ఆ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఎందుకంటే వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న ఓ స్టార్ హీరో నుండి డిఫరెంట్ సినిమా సినిమా వస్తుంటే అంచనాలు మాత్రం ఓ రేంజిలో నెలకొంటాయానే విషయం తెలిసిందే. ఆ విధంగా ఇటీవలే ఓ స్టార్ సినిమా విషయంలో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ సినిమా రిలీజ్ అవ్వగానే నిరాశకు గురయ్యారు. మరి అంత క్రేజీ హైప్ క్రియేట్ చేసిన సినిమాలో ఇలాంటి ఫలితం ఎలా వచ్చిందంటే మరి ఎక్కడ ఫాల్ట్ జరిగి ఉంటుంది.
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కెరీర్ ప్రారంభంలో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. పిజ్జా.. జిగర్తండా సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ తదుపరి సినిమా నుండే అసలు కౌంట్ మొదలైంది. కార్తీక్ తీసే ప్రతి సినిమాకు క్రేజ్ బాగానే ఏర్పడుతుంది. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక డైరెక్టర్ గురించి కాకుండా హీరోలను చూసి సినిమాలకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఇరైవి.. పేట.. సినిమాలతో అదే ప్రూవ్ చేసాడు డైరెక్టర్. అయితే పేట సినిమాలో హీరో తలైవా రజినీకాంత్ కాబట్టి జనాలు ఎలా ఉన్నా పరిగెత్తారు. కానీ రీసెంట్ గా రిలీజ్ చేసిన 'జగమే తంత్రం' సినిమా పరిస్థితి అది కాదు.
ఎందుకంటే డిజిటల్ రిలీజ్ అయింది కాబట్టి థియేటర్స్ అనే మాట వినిపించదు. కానీ తీరా జగమే తంత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఓటిటి రిలీజ్ తో సేఫ్ అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు సినిమా పై ట్రైలర్ సాంగ్స్ తో అంచనాలు పెంచేసాడు. కానీ స్ట్రీమింగ్ మొదలయ్యాక సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకొని నిరాశపరిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు. అదిగాక ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వడం విశేషం. 190 దేశాల్లో 17భాషల్లో జగమే తంత్రం రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ప్రభావం ధనుష్ పై కూడా పడుతోందని టాక్. అసురన్.. కర్ణన్.. లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ధనుష్ ఖాతాలో జగమే తంత్రం నిరాశపరుస్తోంది. మరి డైరెక్టర్ కార్తీక్ తదుపరి చియాన్ విక్రమ్ - ధృవ్ విక్రమ్ లతో ప్లాన్ చేసాడు. చూడాలి మరి ఈసారైనా పంథా మార్చుతాడేమో!