12ఏళ్ల గ్యాప్ కుర్రాడితో డేటింగ్ చేస్తే అప‌రాధ‌మా?

Update: 2022-04-22 07:31 GMT
బాలీవుడ్ హాట్ గాళ్ మలైకా అరోరా తరచుగా అనేక కారణాల వల్ల హెడ్ లైన్స్ లోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. కొన్నేళ్లుగా త‌న‌కంటే చాలా చిన్న‌వాడైన యువ‌హీరో అర్జున్ కపూర్ తో ఆమె సంబంధం దీనికి కార‌ణం. ఈ జంట దాదాపు 12 సంవత్సరాల వయస్సు అంతరం ఉన్నా అన్యోన్య‌త‌లో ఎంతో హుందాగా క‌నిపిస్తున్నా కానీ.. సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు. మలైకా అరోరా భ‌ర్త‌ అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అర్జున్ క‌పూర్ తో స‌హ‌జీవ‌నం చూయ‌డంపై ఈ జంట‌ ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు.

ప‌లుమార్లు త‌మ సంబంధం విష‌యంలో సంతోషంగా ఉన్నామ‌ని కూడా ఈ జంట ప్ర‌క‌టించింది. తాజాగా ప్ర‌ఖ్యాత 'హలో- ఇండియా' మ్యాగ‌జైన్ కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మ‌లైకా దీనిపై మ‌రోసారి స్పందించారు.

మలైకా విడాకుల తర్వాత డేటింగ్ ప్రారంభించాన‌ని తెలిపారు. ఆడవారు యువకులతో డేటింగ్ చేయడానికి 'మిసోజినిస్ట్ విధానం' ఉందని స‌మాజంపై ఎత్తి చూపారు. బ్రేకప్ లేదా విడాకుల తర్వాత మహిళలు జీవితం గడపడం చాలా ముఖ్యం అని మలైకా పేర్కొంది.

స్త్రీ సంబంధాల విష‌యంలో స్త్రీద్వేషపూరిత విధానం ఉంది. ఒక స్త్రీ యువకుడితో డేటింగ్ చేయడం తరచుగా అపరాధంగా పరిగణన‌లోకి వ‌స్తోంది.. అని అన్నారు. మలైకా తన తల్లి బోధనలను అనుస‌రిస్తానని వెల్లడించింది.

నేను నా తల్లికి ప్రతిబింబంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఆమె శక్తిని - ధైర్యాన్ని కలిగి ఉంటాను. ఆమె జీవితాన్ని స‌బ్ కాన్షియ‌స్ గా ప్రతిబింబిస్తాను. ఆమె ఎల్లప్పుడూ నాకు న‌చ్చిన‌ట్టుగా నా నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపమని .. స్వతంత్రంగా ఉండాలని నాకు చెబుతుంది.. అని మలైకా చెప్పారు.

ఈ నెల ప్రారంభంలో మలైకా దురదృష్టవశాత్తు కారు ప్రమాదానికి గురైంది. ప్ర‌స్తుతం దీనినుంచి కోలుకుంటోంది. సంతోషకరమైన ఫిట్ గా ఉండే జీవితం కోసం నిరంత‌రం త‌పిస్తోంది. నేను బలమైన మహిళను.. పని ప‌రంగా పురోగతి ఉంది. నేను ప్రతిరోజూ బలంగా.. ఫిట్టర్ గా .. సంతోషంగా ఉండేలా చూసుకోవడానికి నా కోసం నేను కృషి చేస్తాను.. అని మలైకా నొక్కి చెప్పింది.
Tags:    

Similar News