ఆ బ్యూటీని త‌గ్గించాల్సింది ఇక టాలీవుడ్డే?

Update: 2022-07-04 08:07 GMT
ఇటీవ‌లే ఓ స్టార్ హీరోయిన్ విష‌యంలో ప‌రాయి భాష‌లో ఏస్థాయిలో నెగివిటీ స్ర్పెడ్ అయిందో తెలిసిందే. భారీ పారితోషికంతో పాటు..అద‌నంగా ఖ‌ర్చులు...ఆమె వ్య‌క్తిగత ఖ‌ర్చులు స‌హా బాడీ గార్డు బందోబ‌స్త్ వ్య‌వ‌హారం...ప్రయివేట్ చార్టెడ్ ప్లైట్ ఖ‌ర్చుల‌తో  నిర్మాత‌లు చుక్క‌లు కనిపించాయి. అవి చాల‌వ‌న్న‌ట్లు అమ్మ‌డు రెస్టారెంట్లు..హోట‌ల్ బిల్లు చూసి నిర్మాత‌లు స్ట‌న్ అయిపోయారు. ల‌క్ష‌ల్లో బిల్లు చూసి నిర్మాత‌లు  రీల్ బొమ్మ కాస్తా రియల్ గానే క‌నిపించింది.

అస‌లే సినిమా పోయిన బాధ‌లో  ఉన్న నిర్మాత‌ల‌కు కొత్తగా ఇదేం త‌ల‌నొప్పి! అనుకున్నారు. ఏదైతే అదే జ‌రుగుతుంద‌ని భావించిన నిర్మాత‌లు ఆ బిల్లుల్ని హీరోయిన్ నే క‌ట్ట‌మ‌ని తిరిగి పంపిచేసారు. దీంతో వెన‌క్కి త‌గ్గి ఆ బిల్లులు ఆ హీరోయిన్ నే క‌ట్టేసింది. ప్ర‌స్తుతం ఆ బ్యూటీకి అక్క‌డ అవ‌కాశాలు లేవు. టాలీవుడ్  ప్రాజెక్ట్ లు  రెండు..మూడు చేతిలో ఉన్నాయి. కొత్త అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు బ్యూటీ వేగాన్ని త‌గ్గించాల్సిన బాధ్య‌త ఇప్పుడు టాలీవుడ్ పై ఎంతైనా? ఉంద‌ని ఫీడ్ బ్యాక్ అందుతోంది. బ్రాండ్ ఉంద‌ని నెత్తిన ఎక్కించుకుంటే శివ తాడ‌వం ఆడేస్తుంద‌ని.. అమ్మ‌డిని ఎంత త‌గ్గిస్తే అంత సేఫ్ గా ఉంటామ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. వెన‌క్కి లాగ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యంగానూ భావిస్తున్నారుట‌.

ఇటీవ‌లే అమ్మ‌డు న‌టించిన మూడు సినిమాలు వ‌రుస వైఫ‌ల్యాలు అయ్యాయి. దీంతో అమ్మ‌డిపై ఐరెన్ లెగ్ అనే ముద్ర ప‌డింది. ఇంత‌కు మించిన మంచి ఛాన్స్  ఇంకెప్పుడు దొరుకుతుంది? అందుకే ఆ బ్యూటీ అద‌న‌పు భారంపై ప్ర‌క్షాళ‌ను సిద్ద‌మైన‌ట్లు వినిపిస్తుంది.

కేవ‌లం పారితోషికం.. చెల్లించాల్సిన కొన్ని ర‌కాల అద‌న‌పు ఖ‌ర్చ‌లు మిన‌హా వ్య‌క్తిగ‌త ఖ‌ర్చుల‌తో త‌మ‌కెలాంటి సంబంధం లేకుండా ముందుగానే అగ్రిమెంట్ రాసుకునేలా కొత్త ప్ర‌తి పాద‌న‌ల‌తో  చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు సమాచారం.

అస‌లే సినిమా నిర్మాణం పెరిగిపోతున్న నేప‌థ్యంలో ఇలాంటి ఖ‌ర్చులు  నిర్మాత‌కి మ‌రింత భారమ‌ని నిర్మాత‌ల సంఘం సైతం సీరియ‌స్ గానే ఉంద‌ని స‌మాచారం. దానికి సంబంధించి నిర్మాత‌ల సంఘంలో తీర్మానం కూడా చేయాల‌ని ఆలోచ‌న సైతం  ఉందిట‌. ఇలాంటి ఖ‌ర్చుల విష‌యంలో నిర్మాత గ‌ట్టిగా నిల‌బ‌డ‌క‌పోతే నిండా మునిగిపోవ‌డం ఖాయ‌మ‌ని..అంతా ఒకే మాట‌పై ఉండాల‌ని  నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News